‘అవతార్’ సీక్వెల్స్ అఫీషియల్ రిలీజ్ డేట్స్

‘అవతార్’ సిరీస్‌లో మరో నాలుగు సినిమాలు రానున్నాయి. రీసెంట్‌గా ఆ మూవీస్ రిలీజ్ డేట్స్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు..

  • Published By: sekhar ,Published On : October 5, 2019 / 11:56 AM IST
‘అవతార్’ సీక్వెల్స్ అఫీషియల్ రిలీజ్ డేట్స్

‘అవతార్’ సిరీస్‌లో మరో నాలుగు సినిమాలు రానున్నాయి. రీసెంట్‌గా ఆ మూవీస్ రిలీజ్ డేట్స్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు..

‘అవతార్’.. హాలీవుడ్ సినిమా స్టామినా మరోసారి సినీ ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా.. జేమ్స్ కెమరూన్ విజన్‌కి, ఆయన క్రియేట్ చేసిన ‘పండోరా’ అనే న్యూ వరల్డ్ క్రియేషన్‌కి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. 2009లో రిలీజ్ అయిన ‘అవతార్’ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

‘అవతార్’ క్రియేట్ చేసిన రికార్డ్‌ని బీట్ చెయ్యడం ఇతర హాలీవుడ్ సినిమాల వల్ల కాలేదు. 2019లో అది కూడా సెకండ్ రిలీజ్‌లో అవతార్‌ను బీట్ చేసింది ‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’.. దర్శకుడు జేమ్స్ కెమరూన్ ప్రస్తుతం అవతార్ సీక్వెల్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్‌లో మరో నాలుగు సినిమాలు రానున్నాయి. రీసెంట్‌గా ఆ మూవీస్ రిలీజ్ డేట్స్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Read Also : ‘సైరా’ చూడండి : గవర్నర్ తమిళిసైతో చిరు..

‘అవతార్ 2’ డిసెంబర్ 18, 2020న విడుదల కానుంది. ‘అవతార్ 3’ డిసెంబర్ 17, 2021, ‘అవతార్ 4’ డిసెంబర్ 20, 2024, ‘అవతార్ 5’ డిసెంబర్ 19, 2025 తేదీలలో విడుదల కానున్నాయి. సంవత్సరాలలో మార్పు ఉన్నా.. ఈ సినిమాలన్నీ డిసెంబర్ నెలలో వరుసగా నాలుగు రోజులు రిలీజ్ కానుండడం విశేషం.