Avatar 2: సినిమా పంథాను మార్చేసే అవతార్ 2.. విజువల్ వండర్ రెడీ! Avatar that changes the style of cinema .. Visual Wonder Ready with Avatar2

Avatar 2: సినిమా పంథాను మార్చేసే అవతార్ 2.. విజువల్ వండర్ రెడీ!

ఇప్పటిదాకా సినిమాలన్నీ ఒక లెక్క.. ఇకముందు ఒక లెక్క.. అవతార్ సీక్వెల్ వచ్చేస్తుంది.. జేమ్స్ కెమరూన్ అవతార్ తోనే విజువల్ వండర్ చూపించారు. బిగ్ స్క్రీన్ పరిమితుల్ని క్రాస్ చేశారు.. అవతార్ 2తో ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు..?

Avatar 2: సినిమా పంథాను మార్చేసే అవతార్ 2.. విజువల్ వండర్ రెడీ!

Avatar 2: ఇప్పటిదాకా సినిమాలన్నీ ఒక లెక్క.. ఇకముందు ఒక లెక్క.. అవతార్ సీక్వెల్ వచ్చేస్తుంది.. జేమ్స్ కెమరూన్ అవతార్ తోనే విజువల్ వండర్ చూపించారు. బిగ్ స్క్రీన్ పరిమితుల్ని క్రాస్ చేశారు.. అవతార్ 2తో ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు..? ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతున్నారు..? ఇప్పటికే రిలీజ్ అయిన ట్రయిలర్ ఎలా ఉంది? డిటైల్డ్ గా తెలుసుకుందాం.

Avatar 2: హాలీవుడ్ కీ తప్పని లీకుల బెడద.. ఆన్​లైన్​లో ‘అవతార్​ 2’ ట్రైలర్​!

ప్రపంచవ్యాప్తంగా క్రియేటివ్ ఫీల్డ్ లో కొత్తదనం చూపించడంలో జేమ్స్ కెమరూన్ తర్వాతే ఎవరైనా.. హాలీవుడ్ మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ 2009లో బిగ్ స్క్రీన్ పరిమితుల్ని దాటి తెరకెక్కించిన అవతార్ వచ్చి వరల్డ్ వైడ్ ఎన్ని సంచలనాలు సృష్టించిందో చూశాం.. దశాబ్ధనికి పైగా గ్యాప్ తీసుకుని, అవతార్ కి సీక్వెల్ గా మరో విజువల్ వండర్ అవతార్ ది వే ఆఫ్ వాటర్ రాబోతుంది. ఈ మూవీ కోసం గ్లోబల్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఈ అవతార్ సీక్వెల్ ఫూటేజీని లాస్ వేగాస్ లోని సినిమా కాన్ షోకేజ్ లో ఏప్రిల్ 27న ప్రదర్శించారు.. తాజాగా ఆన్ లైన్ లో అవతార్ ది వే ఆఫ్ వాటర్ టీజర్ రిలీజ్ చేశారు.

Avatar 2: నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వరల్డ్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ రిలీజ్!

పండోరా గ్రహంపై మానవుల విధ్వంసాన్ని అవతార్ 1లో చూసాం. ఇప్పుడు జేక్, నెయిత్రీ ఫ్యామిలీ ఫేస్ చేయబోతున్న స్ట్రగుల్స్, మానవులపై చేసే యుద్ధాన్ని అవతార్ 2లో చూపించబోతున్నాడు కేమరూన్. అదీ పండోరా గ్రహంపై ఉన్న వాటర్ రీజియన్స్ లో. అవతార్ సీక్వెల్ ది వే ఆఫ్ వాటర్ మాక్సిమమ్ నీటి లోతుల్లోకే ప్రేక్షకుల్ని తీసుకెళ్లబోతుంది. డాక్టర్స్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ సినిమా రన్ అవుతున్న థియేటర్స్ లో మే 6 నుంచి రన్ అవుతున్న అవతార్ ది వే ఆఫ్ వాటర్ ట్రయిలర్ ఇప్పుడు ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకూ ఏ సినిమా కనీ వినీ ఎరుగనన్ని భాషల్లో.. ఏకంగా 160 లాంగ్వేజెస్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో డిసెంబర్ 16న రిలీజ్ చేయబోతున్నారు.

Avatar 2: సకుటుంబ సపరివార సమేతంగా రానున్న అవతార్-2

అవతార్ తో బాక్సాఫీస్ కలెక్షన్స్ ను షేక్ చేసి.. ఎవరూ క్రాస్ చేయని రికార్డ్ కొట్టేసిన లెజెండరీ డైరెక్టర్.. అవతార్ ది వే ఆఫ్ వాటర్ తో టెక్నాలజీ పరంగా మరింత ముందుకెళ్లి.. త్రీడిలో హై రిసొల్యూషన్, హై ఫ్రేమ్ రేట్ తో నాచురాల్ గా కనిపించే విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను తీసుకొస్తున్నారు. అవతార్ నుంచి అవతార్ 2 దశాబ్ధ కాలానికి పైగా టైమ్ గ్యాప్ తీసుకున్న టీమ్. అవతార్ 3 ని 2024 లో, అవతార్ 4ను 2026లో అవతార్ ఫిఫ్త్ వెర్షన్ ను 2028లో రెండు సంవత్సరాల టైమ్ గ్యాప్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

Avatar2 Teaser Trailer : వావ్ అనాల్సిందే.. విజువల్ వండర్ అవతార్-2 టీజర్ ట్రైలర్ వచ్చేసింది

అవతార్ లో నటించిన సామ్ వర్టింగ్టన్, జ్యో స్యాల్దానా, స్టీఫెన్ లాంజ్, మిచెల్ రోడ్రిగ్జ్ అండ్ సింగర్నీ వేవర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. కేట్ విన్స్లెట్, మిచెల్ యో, డేవిడ్ థెవ్లిస్ మరియు విన్ డీజిల్ ఈ సీక్వెల్ఫ్రాంచైజీలో నటిస్తున్నారు. అద్భుతమైన లొకేషన్స్.. మైమరిపించే విజువల్ ఎఫెక్ట్స్.. మెస్మరైజింగ్ పెర్ఫామెన్స్ తో అవతార్ ది వే ఆఫ్ వాటర్ ట్రయిలర్ గ్లోబల్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది.

×