Avika Gor : నా ప్రతి అడుగులోనూ తనే ఉన్నాడు.. ప్రియుడి గురించి గొప్పగా చెప్తున్న చిన్నారి పెళ్లికూతురు..

తాజాగా టెన్త్‌ క్లాస్‌ డైరీస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన టెన్త్ క్లాస్ రోజులతో పాటు తన ప్రియుడి గురించి కూడా చెప్పింది. అవికా గోర్ మాట్లాడుతూ..............

Avika Gor : నా ప్రతి అడుగులోనూ తనే ఉన్నాడు.. ప్రియుడి గురించి గొప్పగా చెప్తున్న చిన్నారి పెళ్లికూతురు..

Avika Gor

Avika Gor :  చిన్నారి పెళ్లికుతారు సీరియల్ తో దేశవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకుంది అవికా గోర్. ఆ తర్వాత తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. తాజాగా టెన్త్ క్లాస్ డైరీస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతుంది అవికా. ఇక అవికా గతంలోనే తన ప్రియుడి గురించి అధికారికంగా చెప్పేసింది. ప్రియుడితో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తాజాగా టెన్త్‌ క్లాస్‌ డైరీస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన టెన్త్ క్లాస్ రోజులతో పాటు తన ప్రియుడి గురించి కూడా చెప్పింది. అవికా గోర్ మాట్లాడుతూ.. ”నా టెన్త్ క్లాస్ రోజులన్నీ ఎక్కువగా షూటింగ్ సెట్లోనే గడిచాయి. అప్పటికే నేను నటిని కావడంతో స్కూల్‌కి తక్కువగా వెళ్ళేదాన్ని. కానీ స్కూల్ కి వెళ్లిన కొన్ని జ్ఞాపకాలు మాత్రం మదిలో పదిలంగా ఉన్నాయి. ఈ సినిమా కూడా అందరినీ ఆ రోజుల్లోకి తీసుకెళ్తుంది. శ్రీలంక, రాజమండ్రి, చిక్‌మగళూరు… ఇలా చాలా ప్రదేశాల్లో షూటింగ్ చేశాం. హిందీలో సీరియల్స్ వరుసగా ఉండటం వల్ల మొదట్లో తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. ప్రస్తుతం ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’, ‘థ్యాంక్‌ యూ’ సినిమాలు వరుసగా రాబోతున్నాయి. త్వరలోనే మరిన్ని తెలుగు సినిమాలు అనౌన్స్ అవుతాయి” అని తెలిపింది.

Vidyut Jamwal : నేను చూసిన బెస్ట్ డ్యాన్సర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌తో టచ్‌లో ఉంటా అంటున్న బాలీవుడ్ హీరో..

ఇక అవికా తన ప్రియుడు మిలింద్ గురించి మాట్లాడుతూ.. ”వ్యక్తిగత జీవితం చాలా సంతృప్తిగా ఉంది. మిలింద్‌తో ప్రేమ ప్రయాణం బాగుంది. నేను బరువు తగ్గడం నుంచి, నిర్మాతగా మారడం వరకూ తను నా ప్రతి అడుగులో తోడు ఉన్నాడు. నా గురించి అన్ని తెలుసుకొని, నేనేం చేయగలనో తెలుసుకునేలా చేసి నాకు మరింత సపోర్ట్ గా నిలిచాడు మిలింద్. తన పరిచయం తర్వాత నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది” అని తెలిపింది.