Avika Gor : నిర్మాతగా మారిన చిన్నారి పెళ్లికూతురు
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ తో మన అందరికి దగ్గరైన అవికా గోర్ 'ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోయిన్ గా మారి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తర్వాత తెలుగులో

Avika
Avika Gor : ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో మన అందరికి దగ్గరైన అవికా గోర్ ‘ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోయిన్ గా మారి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. తెలుగుతో పాటు అప్పుడప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. ఇటీవల జీ5 ఓటిటిలో రిలీజ్ అయిన ‘నెట్’ అనే వెబ్ సినిమాతో అందర్నీ అలరించింది. ఇటీవలే తనకి కాబోయే భర్తని కూడా సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది. ఈ భామ ఇప్పుడు నిర్మాతగా మారనుంది.
Freida pinto : ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ హీరోయిన్ కి బేబీ షవర్ ఫంక్షన్
అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించడానికి సిద్ధమైంది. ఈ బ్యానర్ లో తొలి సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. నిర్మాతగా తన తొలి సినిమా ఇటీవల 10 రోజులపాటు గోవాలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరిగింది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా గోవాలో దిగిన ఫోటోని షేర్ చేస్తూ… నిర్మాతగా నా తొలి చిత్రం నాకు అమేజింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. తొలిసారి సినిమా నిర్మిస్తుండటం అద్బుతమైన అనుభవం. 10 రోజులపాటు గోవాలో సినిమా చిత్రీకరించాం. అలలన్నీ చాలా భిన్నంగా ఉన్నాయి. నిర్మాతగా ఉండటం నాకు మరింత సహనాన్ని నేర్పించింది. అంతే కాక ఓ వ్యక్తిగా ఎలా ఎదగాలో చెప్పేందుకు సాయపడింది. నా పట్ల నేను చాలా గర్వంగా ఫీలవుతున్నా. సినిమా పూర్తయి ఎప్పడు విడుదలవుతుందా అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నానని పోస్ట్ చేసింది.