అయినను పోయిరావలె హస్తినకు..

  • Edited By: vamsi , January 25, 2020 / 06:18 AM IST
అయినను పోయిరావలె హస్తినకు..

అయినను పోయిరావలె హస్తినకు.. ఏంటీ ఇదేదో రాజకీయాల్లో వాడే పదం అని అనుకుంటున్నారా? రాజకీయాల్లో ఎక్కువగా.. డిల్లీకి వెళ్లడం అనే మాటలను హస్తినకు పోయిరావలే అని వాడుతూ ఉంటారు రాజకీయ నాయకులు అయితే ఇప్పుడు ఈ మాట అంటుంది ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. అల.. వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్.. తన తర్వాతి సినిమాని తారక్‌తో తెరకెక్కిస్తున్నట్లుగా ఇప్పటికే తెలిసిపోయింది. ఈ సినిమా షూటింగ్ కూడా ఆగస్ట్ నుంచి మొదలు పెట్టనున్నట్లు సమాచారం..

అయితే ఈ సినిమాకు పెడుతున్న టైటిల్ విషయమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తను తర్వాత తీయబోయే సినిమాకు ‘అ’ అనే అక్షరంతోనే మొదలయ్యే టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే ‘అయినను పోయిరావలె హస్తినకు..’ అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పందొమ్మిదేళ్లలో కేవలం పదకొండు సినిమాలకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్.. అతడు సినిమాకు తొలిసారి ‘అ’ పేరుతో టైటిల్ పెట్టారు. 2013లో ఆయన దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం ఎంతటి బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత తీసిన జులాయి, సన్నాప్ సత్యమూర్తి తప్ప తక్కిన అన్ని సినిమాలకు ‘అ’తోనే టైటిల్ పెట్టారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఈ సినిమాకి  ‘అయినను పోయిరావలె హస్తినకు..’ అనే టైటిల్ పెట్టినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న తారక్ ఆ సినిమాకు సంబంధించిన వర్క్‌ని మే  వరకు పూర్తి చెయ్యనున్నారు. తర్వాత ఈ సినిమాకు సంబంధించిన వర్క్ స్టార్ట్ చేస్తారు. ఈలోపు పూర్తి కథను సిద్ధం చేసి త్రివిక్రమ్ తారక్‌కి వినిపించనున్నారట. గతంలో పవన్ కళ్యాణ్‌తో ఒక పొలిటికల్ మూవీ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చెయ్యగా.. అప్పుడు అజ్ఞాతవాసి సినిమా చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా పొలిటికల్ జానర్‌లో ఉంటుదా? అని టైటిల్‌ని బట్టి ఆలోచిస్తున్నారు.