Pawan-Rana Movie: పవన్ కళ్యాణ్ భార్యగా ఐశ్వర్య.. మావోయిస్ట్ పాత్రలో?

టాలీవుడ్‌లో క్రేజీ మూవీ లిస్ట్‌లో ఉన్న పవర్ స్టార్-రానా మల్టీ స్టారర్ మూవీ మలయాళ రీమేక్ ‘అయ్యప్పనమ్ కోషియమ్’. ఈ సినిమా షూటింగ్ కోవిడ్ కారణంగా ఆగపోగా.. ఇఫ్పుడు మళ్లీ రీస్టార్ట్ అవుతుంది.

Pawan-Rana Movie: పవన్ కళ్యాణ్ భార్యగా ఐశ్వర్య.. మావోయిస్ట్ పాత్రలో?

Ayyappan Koshium

Pawan-Rana Movie: టాలీవుడ్‌లో క్రేజీ మూవీ లిస్ట్‌లో ఉన్న పవర్ స్టార్-రానా మల్టీ స్టారర్ మూవీ మలయాళ రీమేక్ ‘అయ్యప్పనమ్ కోషియమ్’. ఈ సినిమా షూటింగ్ కోవిడ్ కారణంగా ఆగపోగా.. ఇఫ్పుడు మళ్లీ రీస్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన హీరోయిన్లను ఫిక్స్ చేసుకుంది చిత్రయూనిట్. ఈ సినిమా కోసం.. ఐశ్వర్య రాజేష్, నిత్యామీనన్‌లను హీరోయిన్లుగా తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

ఈ సినిమాలో హీరోయిన్ల పాత్రలు చిన్నవే అయినా.. కీలకమైన పాత్రలే, నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో నటనకు మంచి మార్క్‌లు సంపాదించుకున్న వీరిద్దరినీ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ‘కాక్కాముట్టై’ లాంటి సినిమాలో తమిళ్‌లో.. వరల్డ్ ఫేమస్ లవర్ తెలుగు సినిమాలో నటించి మంచి మార్క్‌లు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకు భార్యగా నటించబోతుంది.

పవన్ కళ్యాణ్ పాత్ర పోలీస్ పాత్ర అయితే, భార్య పాత్ర మావోయిస్ట్ పాత్ర అయ్యి ఉంటుంది. అందుకే ఆమెను సెలెక్ట్ చేసి ఉంటారని తెలుస్తుంది. ఒరిజినల్ మలయాళం మూవీలో అయ్యప్పన్ భార్యకు ఓ పసిబిడ్డ ఉంటుంది, ఆమె మావోయిస్టుతో అనుబంధంగా ఉంటుంది. కాబట్టి తల్లిగా నటించవలసిన పాత్ర అలాగే సీరియస్ క్యారెక్టర్.. కాకాముట్టై సినిమాలో ఐశ్వర్య తల్లిగా అధ్భుతంగా నటించింది. అందుకే ఆమెనే ఇప్పుడు కూడా ఈ సినిమాకు తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

ఇక రానా భార్యగా.. ఈ సినిమాలో నిత్యామీనన్‌ను తీసుకోబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాకు పరుశురామ కృష్ణమూర్తి అనే పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది.