Shahrukh Khan : 2023లో బాద్‌షా కంబ్యాక్..

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ 5 సంవత్సరాలు సినిమాలకు దూరమయ్యాడు. దాంతో షారూక్ ని వెండితెరమీద చూడాలని ఆకలిగా ఎదరు చూస్తోన్నఫ్యాన్స్ కు మాస్ ట్రీట్...............

Shahrukh Khan : 2023లో బాద్‌షా కంబ్యాక్..

Shahrukh

Shahrukh Khan :  బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ 5 సంవత్సరాలు సినిమాలకు దూరమయ్యాడు. దాంతో షారూక్ ని వెండితెరమీద చూడాలని ఆకలిగా ఎదరు చూస్తోన్నఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు ఈ స్టార్. గతంలో వచ్చిన మూడు సినిమాలు జీరో, జబ్ హ్యారీ మెట్ సెజల్ , ఫ్యాన్, రీస్ సినిమాలతో బాలీవుడ్ లో బాద్ షా టైమ్ అయిపోయింది అనుకున్నవాళ్లకు భారీ కంబ్యాక్ తో షాక్ ఇవ్వబోతున్నాడు బాద్షా. వెండితెరమీద షారూక్ ను మిస్ అవుతున్న అభిమానుల కోసం మాస్ ట్రీట్ సిద్ధం చేస్తున్నాడు.

ఇప్పటికే జవాన్ లుక్ వదిలిన షారుఖ్ తాజాగా పఠాన్ ప్రీ లుక్ వదిలాడు. ఇన్నాళ్లూ వచ్చిన గ్యాప్ ను ఈ రెండేళ్లలో ఫిల్ చేయబోతున్నాడు కింగ్ ఖాన్. ఒకటో రెండో సినిమాలతో కాదు, రెండు సంవత్సరాల్లోనే దాదాపు 9 సినిమాలతో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేయబోతున్నాడు. ఇన్నాళ్లూ తనపై అభిమానులు చూపించిన ప్రేమ, ఆదరణకు మంచి గిఫ్ట్ ఇస్తున్నాడు. కొవిడ్ ముందు స్టార్ట్ అయిన పఠాన్ 2023 జనవరి 25న హిందీ, తెలుగు అండ్ తమిళంలో రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు.

Gopichand : పక్కా కమర్షియల్.. టికెట్లు మాత్రం కమర్షియల్ కాదు.. హిట్ పక్కా..

పఠాన్ తో పాటు జవాన్, డుంకీ, బ్రహ్మాస్త్ర, రాకెట్రి, టైగర్ 3 ఇలా వరస సినిమాలతో జెట్ స్పీడ్ లో వర్క్ చేస్తున్నాడు కింగ్ ఖాన్. సిద్ధార్ధ్ ఆనంద్ తెరకెక్కించిన పఠాన్ లో దీపికా పదుకోనే, జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషిస్తుంటే, సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీయరెన్స్ తో అంచనాలు పెంచేశారు. ఆ తర్వాత సౌత్ ఇండియా డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో నటిస్తున్న జవాన్ లో నూ కంప్లీట్ వేరియషన్ చూపించబోతున్నాడు బాద్షా. ఆ తర్వాత బాలీవుడ్ హిట్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో దుంకి చేయబోతున్నాడు. కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ గా కూడా కనబడబోతున్నాడు షారుఖ్. మొత్తానికి బాద్‌షా బ్యాక్ ఇస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.