థియేటర్లలో బాహుబలి రీ-రిలీజ్‌

థియేటర్లలో బాహుబలి రీ-రిలీజ్‌

ఎస్ఎస్ రాజమౌళి హిట్ సినిమాల్లో సూపర్ హిట్ మూవీ బాహుబలి ద బిగెనింగ్, బాహుబలి ద కన్‌క్లూజన్ మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ శుక్రవారం వెండితెరపై కనిపించి రెండు వారాల పాటు ప్రేక్షకులను అలరించనుంది.

రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో కనిపించే ఈ సినిమా ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ప్రజంటేషన్ లో రీ రిలీజ్ కానున్నట్లు కరణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మరోసారి మాయలో పడేసేందుకు సిద్ధమవుతున్నాం. #BaahubaliTheBeginning and #Baahubali2 – The Conclusion సినిమాలను త్వరలోనే రీ రిలీజ్ చేయనున్నాం. అని జోహర్ ట్వీట్ చేశారు.




https://10tv.in/ntr-and-prabhas-fans-waiting-for-updates/
బాహుబలి: ద బిగెనింగ్ నవంబర్ 6న రిలీజ్ కానుండగా, బాహుబలి: ద కన్‌క్లూజన్ నవంబర్ 13న రిలీజ్ కానుంది. బాహుబలి ద బిగెనింగ్ 2015లో రిలీజ్ అవగా ప్రభాస్ తో పాటు రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్య కృష్ణ, సత్య రాజ్, నాజర్ లు ప్రధాన పాత్రల్లో కనిపించారు.

బాక్సాఫీసు రికార్డులన్నింటినీ బ్రేక్ చేసిన బాహుబలి.. భారీ బడ్జెట్ సినిమాల సక్సెస్‌కు బెంచ్ మార్క్‌లా నిలబడింది.