లైవ్‌లో లక్షా పాతిక వేల మందితో ‘బాహుబలి’ పాటలు..

నమస్తే ట్రంప్ - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వాన కార్యక్రమంలో ‘బాహుబలి’ పాటలు..

  • Published By: sekhar ,Published On : February 23, 2020 / 12:05 PM IST
లైవ్‌లో లక్షా పాతిక వేల మందితో ‘బాహుబలి’ పాటలు..

నమస్తే ట్రంప్ – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వాన కార్యక్రమంలో ‘బాహుబలి’ పాటలు..

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటన కోసం సర్వం సిద్ధం చేసింది బీజేపీ ప్రభుత్వం. ట్రంప్ ఈ గడ్డపై కాలు పెట్టిన దగ్గరినుండి తిరిగి అమెరికా చేరుకునే వరకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లూ చేశారు. అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ పేరుతో స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ప్రోగ్రాంలో భాగంగా మన ‘బాహుబలి’ సినిమా పాటలు వినిపించనున్నారు. ట్రంప్ రాకకు గౌరవంగా ‘బాహుబలి’ చిత్రంలోని ‘జై జై కారా (దండాలయ్యా)’ పాటను ప్రముఖ సింగర్ ఖైలాష్ కేర్ ఆలపించనున్నారు. దాదాపు లక్షా పాతిక వేల మందితో కలిసి ఈ పాట పాడనున్నట్టు ఖైలాష్ తెలిపారు.

అలాగే ట్రంప్, మోదీ స్టేడియంలోకి రాగానే గౌరవ సూచికంగా ‘బాహుబలి’ చిత్రంలోని మరో పాటను కూడా ఆలపించనున్నానని.. కుదిరితే ట్రంప్ చేత తన పాటలకు డ్యాన్స్ చేయిస్తానని ఖేర్ తెలిపారు. కాగా తాజాగా ట్రంప్ తన ఫోటోతో మార్ఫింగ్ చేసిన ‘బాహుబలి’ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది.