బావొచ్చాడోలప్పా బావొచ్చాడు – ఊపు ఊపుతున్న ఉత్తరాంధ్ర పాట

‘‘పలాస 1978’’ - ఉత్తరాంధ్ర జానపదం ‘బావొచ్చాడోలప్పా బావొచ్చాడు’ వీడియో సాంగ్..

  • Published By: sekhar ,Published On : February 23, 2020 / 12:55 PM IST
బావొచ్చాడోలప్పా బావొచ్చాడు – ఊపు ఊపుతున్న ఉత్తరాంధ్ర పాట

‘‘పలాస 1978’’ – ఉత్తరాంధ్ర జానపదం ‘బావొచ్చాడోలప్పా బావొచ్చాడు’ వీడియో సాంగ్..

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’. తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

మార్చి 6న రిలీజ్ చేయనున్నారు. విడుదలకు ముందే ఇండస్ట్రీ‌లో హాట్ టాపిక్‌గా మారిందీ మూవీ. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ మెంబెర్స్ ప్రశంసలు పొందింది. ‘నాది నక్కిలీసు గొలుసు’ పాట వైరల్ అయింది. తాజాగా ‘బావొచ్చాడు’ అనే వీడియో సాంగ్ విడుదల చేశారు.

ఉత్తరాంధ్ర జానపదం ఆధారంగా రూపొందించిన ఈ పాటను అదితి భవరాజు పాడారు. ఈ చిత్రానికి  పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె, కో ప్రొడ్యూసర్ : మీడియా 9 మనోజ్, నిర్మాత : ధ్యాన్ అట్లూరి, 
రచన-దర్శకత్వం : కరుణ కుమార్.