తెలుగు, తమిళ్ లో రకుల్ కి తగ్గుతోన్న అవకాశాలు

తెలుగు, తమిళ్ లో రకుల్ కి తగ్గుతోన్న అవకాశాలు

టాలివుడ్ స్టార్ హీరోలందరితో కలిసి నటించిన ఆ స్టార్ హీరోయిన్ ఇప్పుడు బాలివుడ్ లో సెటిల్ అయ్యేందుకు ట్రై చేస్తోంది. తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో హిందీలో క్రేజ్ కోసం ప్రయత్నిస్తోంది. మరి ఆ అమ్మడుకి హిందీలోనైనా  కలిసొస్తుందా..?
Also Read : మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నా ఫ్యాన్స్!

మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి టాలివుడ్ లో చాలా కాలం తర్వాత..ఇప్పుడు సీనియర్ హీరో నాగార్జున నటిస్తోన్న మన్మధుడు 2 సినిమాలో అవకాశం దక్కింది. అందుకే ఒక్క టాలివుడ్ నే నమ్ముకోకుండా ఇటు హిందీలోనూ సినిమాలు చేస్తోంది.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలివుడ్ మీదే బోలెడన్ని హోప్స్ పెట్టుకుంది. అజయ్ దేవగణ్ హీరోగా అకివ్ అలీ డైరెక్షన్ లో తెరకెక్కిన దే దే ప్యార్ దే సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మే 17న రిలీజ్ కానుంది. దే దే ప్యార్ దే మూవీలో రకుల్ ఆల్రెడీ ఓసారి పెళ్లైపోయిన వ్యక్తికి లవర్ గా నటించింది. అంతేకాదు ఈ మూవీ కోసం ఎక్స్ పోజింగ్ గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. కానీ ఇంత చేసినా సినిమాకి మాత్రం అనుకున్నంత హైప్ రావడం లేదు. ఇదే రకుల్ ని టెన్షన్ పెడుతోంది.
Also Read : ఆరంభమేలే.. ఆంథెమ్ ఆఫ్ జెర్సీ : లిరికల్ వీడియో