Gopichand: మరింత ఆలస్యం కానున్న గోపీచంద్ బయోపిక్..?

టాలీవుడ్‌లో బయోపిక్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. గతంలో పలువురి బయోపిక్ చిత్రాలను స్టార్ నటీనటులు తెరకెక్కించగా, వాటికి ఊహించని సక్సెస్‌ను అందించారు అభిమానులు. కాగా, తాజాగా మరో ప్రెస్టీజియస్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు రెడీ అవుతున్నాడు. బ్యాడ్మింటన్ లెజెండరీ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ జీవితకథను బయోపిక్ రూపంలో తెరకెక్కించేందుకు సుధీర్ బాబు రెడీ అయ్యాడు.

Gopichand: మరింత ఆలస్యం కానున్న గోపీచంద్ బయోపిక్..?

Badminton Player Pullela Gopichand Biopic To Get More Delayed

Gopichand: టాలీవుడ్‌లో బయోపిక్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. గతంలో పలువురి బయోపిక్ చిత్రాలను స్టార్ నటీనటులు తెరకెక్కించగా, వాటికి ఊహించని సక్సెస్‌ను అందించారు అభిమానులు. కాగా, తాజాగా మరో ప్రెస్టీజియస్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు రెడీ అవుతున్నాడు. బ్యాడ్మింటన్ లెజెండరీ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ జీవితకథను బయోపిక్ రూపంలో తెరకెక్కించేందుకు సుధీర్ బాబు రెడీ అయ్యాడు.

Sudheer Babu Hunt : లైఫ్‌లో నేను ఎంత ఎదిగినా.. నా జీవితం ఆయనకే అంకితం.. సుధీర్ బాబు!

ఈ సినిమాను గతంలోనే అనౌన్స్ చేసిన సుధీర్ బాబు, ఆయన తన ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేశాకే ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్న దానికంటే కూడా ఈ సినిమా ఆలస్యం అవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. గతంలో తాను కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా సత్తా చాటిన సుధీర్ బాబుకి పుల్లెల గోపీచంద్ స్కూల్‌మేట్ అనే విషయం అందరికీ తెలిసిందే. వారిమధ్య ఉన్న మంచి స్నేహం కారణంగానే సుధీర్ బాబు గోపీచంద్ బయోపిక్ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పాడని చిత్ర యూనిట్ గతంలో వెల్లడించింది.

అయితే ఈ సినిమాను స్టార్ట్ చేసేందుకు మరికొంత సమయం పడుతుందని సుధీర్ బాబు తెలిపారు. హంట్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు కామెంట చేశాడు ఈ యంగ్ హీరో. అయితే పుల్లెల గోపీచంద్ బయోపిక్‌ను మూవీగా రెండు భాగాలుగా తీసుకురావాలా.. లేక వెబ్ సిరీస్ రూపంలో తీసుకురావాలా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మరి ఈ ప్రెస్టీజియస్ బయోపిక్ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అనే విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.