Pathaan : పఠాన్ సినిమాని రిలీజ్ కానివ్వం.. భజరంగ్ దళ్ హెచ్చరిక!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక గత కొన్ని రోజులుగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’ సాంగ్ తో ఈ వివాదం మొదలయింది. కాగా ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కానివ్వం అంటూ భజరంగ్ దళ్ ప్రకటించింది.

Pathaan : పఠాన్ సినిమాని రిలీజ్ కానివ్వం.. భజరంగ్ దళ్ హెచ్చరిక!

Pathaan

Pathaan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక గత కొన్ని రోజులుగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఏ సినిమా ఎదురుకొని వ్యతిరేకతను ఈ చిత్రం ఎదురుకుంటుంది. బాయ్‌కాట్ ట్రెండ్ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోని పఠాన్ సినిమా చేసినా.. చివరాఖరికి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీ నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’ సాంగ్ తో ఈ వివాదం మొదలయింది. కాగా ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కానివ్వం అంటూ భజరంగ్ దళ్ ప్రకటించింది.

Pathaan Trailer : దేశం కోసం వస్తున్న ‘పఠాన్’.. ఫైట్స్ అన్ని గాల్లోనే.. సూపర్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్..

ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి అంటూ సినీ, రాజకీయ, మత సంఘాలు నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో సెన్సార్ బోర్డు ఈ చిత్రంపై ఇప్పటికే పలు కత్తెర వేటులు వేసి రిలీజ్ కి అనుమతిని ఇచ్చింది. అయితే గుజరాత్ భజరంగ్ దళ్.. సెన్సార్ బోర్డు అనుమతితో మాకు సంబంధం లేదు. ఈ సినిమాని కచ్చితంగా అడ్డుకుని తీరుతాము అంటూ సినిమా పోస్టర్స్, దిష్టిబొమ్మలను దగ్ధం చేసి హెచ్చరించారు. కాగా ఇటీవల అహ్మదాబాద్ లోని ఒక థియేటర్ ని ధ్వంసం చేసి, సినిమా విడుదల చేయవద్దు అంటూ థియేటర్ ఓనర్ కి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మరి ఈ సమయంలో పఠాన్ సినిమా విడుదల సాధ్యమవుతుందా? లేదా? అనేది చూడాలి. ఇక ఈ సినిమా నార్త్ తో పాటు సౌత్ లోని పలు భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన తెలుగు ట్రైలర్ ని రామ్ చరణ్ విడుదల చేశాడు. ట్రైలర్ మొత్తం ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో నిప్పేశాడు దర్శకుడు. దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాన్ అబ్రహం విలన్ గా చేస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో మెరవబోతున్నాడు.