Balagam issue : దిల్‌రాజు వర్సెస్ అమెజాన్.. బలగం వివాదం.. ప్రేక్షకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దిల్‌రాజు..

బలగం సినిమా ముఖ్యంగా పల్లెటూళ్లలో జనాలకి బాగా నచ్చింది. దీంతో కొన్ని ఊళ్ళల్లో బలగం సినిమాని తెరలు కట్టి మరీ వీధుల్లో సినిమా వేస్తున్నారు. సినిమాకు ఇంత ఆదరణ వస్తుంది అని చిత్రయూనిట్ ఆనందించినా అమెజాన్ మాత్రం దీనిమీద సీరియస్ అయింది.

Balagam issue : దిల్‌రాజు వర్సెస్ అమెజాన్.. బలగం వివాదం.. ప్రేక్షకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దిల్‌రాజు..

Dil Raju Balagam Movie

Balagam issue :  కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా మారి ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) ముఖ్యపాత్రల్లో మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన సినిమా బలగం(Balagam). దిల్ రాజు(Dil Raju) కూతురు హన్షిత రెడ్డి(Hanshitha Reddy) ఈ సినిమాని నిర్మించింది. చిన్న సినిమాగా రిలీజయి పెద్ద విజయం సాధించింది. కలెక్షన్స్ తో పాటు పేరు కూడా సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి అభినందనలు వస్తున్నాయి.

అయితే బలగం సినిమాకు అభినందనలతో పాటు వివాదాలు కూడా వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం బలగం సినిమా కథ నాది అని ఓ రచయిత వచ్చి వివాదం సృష్టించాడు. ఇప్పుడు మరో వివాదంలో బలగం నిలిచింది. బలగం సినిమా అమెజాన్ ఓటీటీలో రిలీజయిన సంగతి తెలిసిందే. సినిమాకు మంచి పేరు రావడంతో అనుకున్న టైం కంటే ముందే ఎక్కువ డబ్బులు ఇచ్చి అమెజాన్ తన ఓటీటీలో రిలీజ్ చేస్తుంది. ఓ పక్క థియేటర్ రన్ అవుతుండగానే ఓటీటీలో రిలీజ్ అయింది బలగం.

అయితే బలగం సినిమా ముఖ్యంగా పల్లెటూళ్లలో జనాలకి బాగా నచ్చింది. దీంతో కొన్ని ఊళ్ళల్లో బలగం సినిమాని తెరలు కట్టి మరీ వీధుల్లో సినిమా వేస్తున్నారు. సినిమాకు ఇంత ఆదరణ వస్తుంది అని చిత్రయూనిట్ ఆనందించినా అమెజాన్ మాత్రం దీనిమీద సీరియస్ అయింది. ఎక్కువ డబ్బులిచ్చి మరీ కొనుక్కున్నాం, ఇలా ఫ్రీగా ఊళ్ళల్లో షోలు వేస్తే ఎలా సగం డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే అని దిల్ రాజు తో గొడవ పెట్టుకున్నట్టు సమాచారం. దీంతో దిల్ రాజు అమెజాన్ కు ఏం చెప్పుకున్నాడో కానీ తాజాగా నిజామాబాద్ ఎస్పీకి ఈ విషయంలో ఫిర్యాదు చేశాడు.

Nani : థియేటర్స్ కలెక్షన్స్ కి మంచి సినిమాలకు సంబంధం లేదు.. డబ్బులు బాగా వస్తేనే హిట్ అయినట్టు కాదు..

నిజామాబాద్ చుట్టూ పక్కల కొన్ని పల్లెటూళ్లలో సినిమా ఇలా తెరలు కట్టి వేశారని, మా అనుమతి లేకుండా ఇలా సినిమాని ప్రదర్శిండం విరుద్ధం అని, ఇలా చేసేవారిపై చర్యలు తీసుకోవాలని దిల్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయం వైరల్ అవ్వడంతో సినిమాకు ఆదరణ వస్తుంది అని సంతోషించే బదులు ఇలా ప్రేక్షకుల మీద ఫిర్యాదు చేస్తావా అంటూ కొంత మంది దిల్ రాజుని విమర్శిస్తున్నారు.