Mogilayya : మంచానపడ్డ ‘బలగం’ సింగర్.. అండగా నిలిచిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు

బలగం సినిమాలో చివర్లో ఓ బుర్రకథ సాంగ్ తో అందర్నీ మెప్పించారు సింగర్స్, రియల్ బుర్రకథ పాడే కళాకారులు కొమురవ్వ, మొగిలయ్యలు. ఈ ఇద్దరు తమ పాటతో ప్రేక్షకుల్లో కన్నీళ్లు తెప్పించారు. అయితే ఈ సినిమాలో పాట పాడిన మొగిలయ్య ప్రస్తుతం......................

Mogilayya : మంచానపడ్డ ‘బలగం’ సింగర్.. అండగా నిలిచిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు

Balagam Singer Mogilayya effected with health issues and minister Harish Rao helped

Mogilayya :  కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా మారి ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) ముఖ్యపాత్రల్లో మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన సినిమా బలగం(Balagam). దిల్ రాజు(Dil Raju) కూతురు హన్షిత రెడ్డి(Hanshitha Reddy) ఈ సినిమాని నిర్మించింది. చిన్న సినిమాగా రిలీజయి పెద్ద విజయం సాధించింది. కలెక్షన్స్ తో పాటు పేరు కూడా సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రత్యేక అభినందనలు వచ్చాయి. ఇక తెలంగాణ(Telangana) స్లాంగ్ లో, తెలంగాణ ఊరిలో జరిగే కథగా ఈ సినిమా రావడంతో తెలంగాణ ప్రముఖులు కూడా ఈ సినిమాని అభినందిస్తున్నారు.

బలగం సినిమాలో చివర్లో ఓ బుర్రకథ సాంగ్ తో అందర్నీ మెప్పించారు సింగర్స్, రియల్ బుర్రకథ పాడే కళాకారులు కొమురవ్వ, మొగిలయ్యలు. ఈ ఇద్దరు తమ పాటతో ప్రేక్షకుల్లో కన్నీళ్లు తెప్పించారు. అయితే ఈ సినిమాలో పాట పాడిన మొగిలయ్య ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో మంచాన పడ్డాడు. రెండు కిడ్నీలు పాడయి, షుగర్, బిపి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. ఇప్పటికే ఈ విషయం తెలిసి బలగం సినిమా టీం తరపున వేణు లక్ష రూపాయల ఆర్ధిక సహకారం చేశాడు.

Raviteja Vs Ram : దసరాకు టైగర్ నాగేశ్వరరావు వర్సెస్ బోయపాటి మాస్.. పోటీపడబోతున్న రవితేజ, రామ్

తాజాగా మొగిలయ్య కష్టాల్లో ఉన్నాడని తెలియడంతో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మొగిలయ్యకు ఆపన్న హస్తం అందించారు. మొగిలయ్యను అంబులెన్స్ లో తీసుకెళ్లి, అన్ని పరీక్షలు చేసి, కిడ్నీలకు డయాలసిస్ చేయించి రెగ్యులర్ గా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే మరో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మొగిలయ్య వైద్యానికి అయ్యే ఖర్చంతా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇస్తామని, నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తామని తెలిపారు.