Unstoppable with NBK : నా లైఫ్‌లో మర్చిపోలేని పాత్ర అది : బాలకృష్ణ

గతంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ 'పైసా వసూల్' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి గుర్తుచేసుకున్నారు బాలకృష్ణ. ‘మాటల గన్‌.. మన జగన్‌’ అంటూ పూరి జగన్నాధ్.........

Unstoppable with NBK : నా లైఫ్‌లో మర్చిపోలేని పాత్ర అది : బాలకృష్ణ

Nbk

Balakrishna  : బాలకృష్ణ యాంకర్ గా మొదలు పెట్టిన షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తుంది. ఈ షోకి ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. తాజాగా ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ తొమ్మిదవ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ కి ‘లైగర్’ టీం నుంచి పూరి జగన్నాధ్, ఛార్మి, విజయ్ దేవరకొండ వచ్చారు. దీంతో ఈ ప్రోమోలో బాలయ్య రచ్చ రచ్చ చేశారు. గతంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ ‘పైసా వసూల్’ సినిమా చేసిన సంగతి తెలిసిందే.

Rajashekar : రియల్ తండ్రి కూతుళ్లు.. రీల్‌లో కూడా

ఈ సినిమా గురించి గుర్తుచేసుకున్నారు బాలకృష్ణ. ‘మాటల గన్‌.. మన జగన్‌’ అంటూ పూరి జగన్నాధ్ గురించి చెప్పాడు. ‘పైసా వసూల్‌’ సినిమా గురించి మాట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను మ‌ర‌చిపోలేని పాత్ర తేడా సింగ్‌ అని బాలయ్య అన్నారు. ఆ పాత్ర నాకు ఎప్పటికి గుర్తుండిపోతుందని, చాలా స్పెషల్ అని అన్నారు బాలకృష్ణ. ఆ సినిమాలో డైలాగ్ ‘నేనెంత యెద‌వ‌నో నాకే తెలియ‌దు’ అని చెప్పి ‘ఆ మాట నేనే అంట.. ఇంకెవరైనా అంటే కొడతా’ అని అన్నారు బాలయ్య. ఇక సినిమాలోని ‘మామా ఏక్ పెగ్ లా..’ సాంగ్‌ను గుర్తు చేసి ఇప్పటికి కూడా అందరూ ఈ సాంగ్ పాడుకుంటున్నారు అన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా, హ్యాపినెస్ వచ్చినా మామా ఏక్ పెగ్ లా అంటున్నారని అన్నారు బాలయ్య. ఎపిసోడ్ ప్రోమో ఆద్యంతం అలరించింది. దీంతో అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.