Akhanda: ముహూర్తం పెట్టేసిన బాలయ్య.. విడుదల ఎప్పుడంటే?

నందమూరి అభిమానులు సాలిడ్ హిట్ కోసం మరీ ముఖ్యంగా బాలయ్య నుండి మాంచి మాస్ మసాలా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అసలే వచ్చేది బోయపాటి దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా కావడంతో అఖండ సినిమా మీద అంచనాలకు కొలతలు లేకుండా పోయాయి.

Akhanda: ముహూర్తం పెట్టేసిన బాలయ్య.. విడుదల ఎప్పుడంటే?

Akhanda

Akhanda: నందమూరి అభిమానులు సాలిడ్ హిట్ కోసం మరీ ముఖ్యంగా బాలయ్య నుండి మాంచి మాస్ మసాలా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అసలే వచ్చేది బోయపాటి దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా కావడంతో అఖండ సినిమా మీద అంచనాలకు కొలతలు లేకుండా పోయాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచగా ఇప్పుడు బాలయ్య అభిమానులు సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

తెలంగాణలో లాక్ డౌన్ తొలగించడంతో థియేటర్లు ఓపెన్ చేసేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో సినిమాల విడుదలకు ముహూర్తాలను వెతికే పడ్డారు మేకర్స్. ఈక్రమంలోనే బాలయ్య అఖండకు కూడా ముహూర్తం పెట్టేశారని వినిపిస్తుంది. సెప్టెంబర్ 10న అఖండ సినిమా విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్ నడుస్తుంది. ఇప్పటి వరకు సినిమా విడుదలపై అధికారిక ప్రకటన లేకపోగా సన్నాహాలు మొదలుకావడంతో అంచనాలు మొదలయ్యాయి.

ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యకు జోడిగా ప్రగ్యాజైస్వాల్ నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు బోయపాటి అంచనాలను మించేలా తెరకెక్కిస్తున్నాడని చెప్తున్నారు. మరి సినిమా రిలీజ్ ఎప్పుడు ఉండనుంది.. ట్రైలర్స్ విడుదల ఎప్పుడన్నది మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.