Akhanda : గుమ్మడికాయ కొట్టేశారు.. గర్జనకు రెడీ..

నటసింహా నందమూరి బాలకృష్ణ - ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో వస్తున్న ‘అఖండ’ షూటింగ్ పూర్తయ్యింది..

Akhanda : గుమ్మడికాయ కొట్టేశారు.. గర్జనకు రెడీ..

Nbk

Akhanda: ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ షూట్‌తో చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిచేసింది యూనిట్‌.

Nandamuri Balakrishna : ‘ఆహా’ లో బాలయ్య అదిరిపోయే టాక్ షో..!

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లో విడుదల తేదిని ప్ర‌క‌టించ‌నున్నారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, మిర్యాల రవీందర్ రెడ్డి, శ్రీధర్ షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని సింబాలిక్‌గా చూపిస్తున్నారు. ఇప్పుడీ పోస్టర్ ట్రెండింగ్‌లో ఉంది.

Akhanda

 

Balakrishna : టైసన్ కోసం బాలయ్య..!

బాలకృష్ణ, బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌ కావడంతో సినీ వర్గాలు, అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఆడియ‌న్స్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ఈ సినిమాలో బాలయ్య‌ను ఇంతకు ముందెన్నడూ చూడని స‌రికొత్త‌పాత్ర‌లో చూపిస్తున్నందున ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనివుంది. ఈ సినిమాలో డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నారు బాలకృష్ణ. ఒక పాత్రలో అఘోరాగా కనిపించ‌నున్నారు.

Balayya

బాలకృష్ణ రెండు పాత్రలను పరిచయం చేస్తూ విడుద‌ల చేసిన ‘అఖండ ఫ‌స్ట్ రోర్‌’ కి అద్భుతమైన స్పందన లభించింది. అలాగే ఇటీవ‌ల విడుద‌ల చేసిన ‘అడిగా అడిగా’ అంటూ సాగే మొదటి పాట సంగీత ప్రియులను ఆక‌ట్టుకుంది.

Chennakesava Reddy : బాలయ్య ఫ్యాన్స్ రచ్చ రంబోలా..

మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ద్వార‌క క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నారు.