Balayya-Pawan : బాలయ్య బాబు – పవన్ మధ్య ఇంత స్నేహం ఉందా??

బాలయ్య - పవన్ ఎపిసోడ్ లో అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు. అసలు వీరిద్దరూ కలవరు ఎక్కువగా అని చాలా మంది అనుకుంటారు. కానీ వీరి స్నేహం గురించి బయటపెట్టారు షోలో...............

Balayya-Pawan : బాలయ్య బాబు – పవన్ మధ్య ఇంత స్నేహం ఉందా??

Balayya-Pawan :  బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీ లో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సెకండ్ సీజన్ మరింత పాపులార్ అయింది. ఇక సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షో దేశవ్యాప్తంగా మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఈ ఎపిసోడ్ తో సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ షో. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ షూటింగ్ మొదలయిన దగ్గర్నుంచి బాలయ్య, పవన్ అభిమానులు హంగామా చేస్తూనే ఉన్నారు. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ఆహా ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటల నుండి స్ట్రీమింగ్ చేశారు.

పవన్ అభిమానులు, అటు బాలకృష్ణ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. రిలీజయిన కొద్దిసేపటికే చాలామంది చూసి సరికొత్త రికార్డులని సెట్ చేశారు. కొన్ని చోట్ల అభిమానులు ఈ షోని స్పెషల్ ప్రివ్యూ వేశారు. అయితే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ మొదటి ఎపిసోడ్ లో పవన్ ఫ్యామిలీ, సినిమాలు గురించి మాట్లాడారు. ఇక రెండో ఎపిసోడ్ లో రాజకీయాలు మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. బాలయ్య – పవన్ ఎపిసోడ్ లో అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు. అసలు వీరిద్దరూ కలవరు ఎక్కువగా అని చాలా మంది అనుకుంటారు. కానీ వీరి స్నేహం గురించి బయటపెట్టారు షోలో.

K Viswanath : కళాతపస్వి వచ్చి అభిమానితో మాట్లాడితే.. వైరల్ అవుతున్న ఓ అభిమాని ఆవేదన..

బాలకృష్ణ మాట్లాడుతూ.. మేమిద్దరం మొదటి సారి కలిశాం అనుకుంటారు. కానీ ఎప్పట్నుంచో మేము కలిసే ఉన్నాము. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము అని అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మేము ఎన్నో సార్లు కలిశాం. మొదటిసారి సుస్వాగతం సినిమా షూటింగ్ సమయంలో కలిసి మాట్లాడుకున్నాం. కానీ అంతకుముందే మద్రాస్ లో ఉన్నప్పుడు అన్నయ్య కోసం, అన్నయ్య పుట్టిన రోజు వేడుకలకు వచ్చినప్పుడు దూరం నుండి చూసేవాడిని. సుస్వాగతం తర్వాత చాలా సార్లు కలిశాం. బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలకు వెళ్ళాను. ఇద్దరం కలిసి క్రికెట్ మ్యాచ్ కూడా ఆడాము. సెలబ్రిటీ క్రికెట్ లో ఇద్దరం పాల్గొన్నాము. రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాము అని అన్నారు. బాలయ్య.. చెన్నైలో ఉన్నప్పుడే మాట్లాడి ఉంటె ఇప్పటికి ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళం అని అన్నారు. ఎపిసోడ్ అంతా పవన్, బాలయ్య సరదాగా నవ్వుతూ సాగడంతో అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.