RGV : బాలకృష్ణ షోలో ఆర్జీవీని పొగిడిన సురేష్ బాబు..

తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని సినిమాల ఫోటోలు చూపించి వాటి గురించి చెప్పామన్నారు బాలయ్య బాబు. ఇందులో భాగంగా మాయాబజార్, శంకరాభరణం, ఆదిత్య 369, బాహుబలి, శివ, అల్లూరి సీతారామరాజు సినిమాల ఫోటోలు చూపించారు. వీటిపై అల్లు అరవింద్, సురేష్ బాబు....................

RGV : బాలకృష్ణ షోలో ఆర్జీవీని పొగిడిన సురేష్ బాబు..

Balakrishna and Suresh Babu praised RGV in Unstoppable show

RGV :  ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో నాలుగు ఎపిసోడ్లు కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా బాగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ఆహాలో రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వస్తుంది.

ఇక ఈ ఎపిసోడ్ లో అనేక సినిమాల గురించి, సినిమాల విషయాల గురించి మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని సినిమాల ఫోటోలు చూపించి వాటి గురించి చెప్పామన్నారు బాలయ్య బాబు. ఇందులో భాగంగా మాయాబజార్, శంకరాభరణం, ఆదిత్య 369, బాహుబలి, శివ, అల్లూరి సీతారామరాజు సినిమాల ఫోటోలు చూపించారు. వీటిపై అల్లు అరవింద్, సురేష్ బాబు తమ అభిప్రాయాలని చెప్పారు.

అయితే శివ సినిమా గురించి మాట్లాడుతూ ఆర్జీవీ గురించి మాట్లాడారు సురేష్ బాబు. సురేష్ బాబు ఆర్జీవీ గురించి మాట్లాడుతూ.. ”అసలు ఈ సినిమా గురించి మొదట నాకు తెలీదు. సురేందర్, వెంకట్ కి తెలియకుండా సినిమా ఓకే చేసుకున్నాడు ఆర్జీవీ. అతను చాలా సూపర్ ట్యాలెంటెడ్. డైలీ నాకు షూట్ గురించి అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు. ఆ సమయంలో ఇక్కడ స్ట్రైక్ జరుగుతుంటే రీ రికార్డింగ్ కోసం ముంబైకి వెళ్లారు. అక్కడికే వెళ్తే ఇళయరాజా, ఇంకా చాలా మందితో ఆర్జీవీ రీ రికార్డింగ్ చేయిస్తున్నాడు. అక్కడ అందరూ అతన్ని పొగిడేస్తున్నారు, మరో పక్క పని రాక్షసుడు అని తిడుతున్నారు. ఇంత ట్యాలెంట్ ఏంటి సర్ ఇతనికి అని నాకు చెప్పేవాళ్ళు. ఆ సినిమాకి అన్ని తనే దగ్గరుండి చూసుకున్నాడు అని తెలిపారు.

MayaBazar : మాయాబజార్ వీళ్లిద్దరికీ ఎంత స్పెషలో తెలుసా??

దీనిపై బాలకృష కూడా మాట్లాడుతూ ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ గా రాజు మాస్టర్ పేరు వేశారు. కానీ ఆర్జీవీనే చేశాడు. ఆ తర్వాత నా లారీ డ్రైవర్ సినిమాకి రాజు మాస్టర్ వచ్చాడు. ఇక్కడికి వచ్చి శివ సినిమా ఫైట్స్ ని ఆదర్శంగా తీసుకొని చేయించేవాడు, అది, ఇది వేరే సినిమాలు రా బాబు అని అతనితో నేను గొడవ పడేవాడ్ని. అంతలా శివ సినిమా చాలా మంది మీద ప్రభావం చూపించింది అని చెప్పారు. మొత్తానికి అన్‌స్టాపబుల్ షోలో ఆర్జీవీ గురించి పొగిడేశారు. .