NBK 108 : బాలయ్య అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఇదేనా? సోషల్ మీడియాలో వైరల్.. ఇంత మీనింగ్ ఉందా టైటిల్లో?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న NBK 108 సినిమాలో కాజల్ హీరోయిన్ నటిస్తుండగా శ్రీలీల, శరత్ కుమార్, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Balakrishna Anil Ravipudi movie NBK 108 Title goes viral in social media
Balakrishna : బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ(Akhanda), వీరసింహారెడ్డి(Veera SimhaReddy) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్100 కోట్ల సూపర్ హిట్ సినిమాలు సాధించారు. ప్రస్తుతం బాలయ్య బాబు అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కామెడీ సినిమాలు చేసే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ సినిమాలు చేసే బాలయ్య సినిమా అనగానే అంతా ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పటికే NBK 108 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న NBK 108 సినిమాలో కాజల్ హీరోయిన్ నటిస్తుండగా శ్రీలీల, శరత్ కుమార్, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దసరాకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా తెలంగాణ యాసలో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిత్రయూనిట్ ఇంకా టైటిల్ అనౌన్స్ చేయకపోయినా టైటిల్ లీక్ అయిందని వార్తలు వస్తున్నాయి.
Srikanth Odela : దసరా సక్సెస్ తో పెళ్లి చేసుకున్న డైరెక్టర్.. నాని స్పెషల్ ట్వీట్..
అనిల్ రావిపూడి – బాలకృష్ణ సినిమాకు ‘భగవత్ కేసరి’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. అఖండ సినిమాలో శివుడి ప్రతిరూపంగా తీసుకుంటే ఇందులో భగవత్ అని విష్ణువు ప్రతిరూపంగా తీసుకున్నారట. అలాగే బాలయ్య అంటే ముందు సింహం సెంటిమెంట్ గుర్తొస్తుంది కదా. సింహాన్ని హిందీలో కేసరి అంటారు. ఆ రెండిటిని కలిపి భగవత్ కేసరి అని పెట్టారట టైటిల్. మన చరిత్రలో చదువుకున్నట్టు ఆంధ్ర కేసరి, పంజాబ్ కేసరి అని పవర్ ఫుల్ టైటిల్స్ లాగే సినిమాలో కూడా భగవత్ కేసరి చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ అంట. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి చిత్రయూనిట్ ఇదే టైటిల్ ని అనౌన్స్ చేస్తారా లేదా ఇంకేదైనా కొత్త టైటిల్ ని ప్రకటిస్తారా చూడాలి.