Balakrishna: రవితేజ సినిమా టైటిల్‌ను సగం వాడేస్తున్న బాలయ్య..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రాబోయే సినిమాకు బాలయ్య మాస్ రాజా రవితేజకు చెందిన ఓ సినిమా టైటిల్‌లో నుంచి సగం వాడబోతున్నాడట.

Balakrishna: రవితేజ సినిమా టైటిల్‌ను సగం వాడేస్తున్న బాలయ్య..?

Balakrishna: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Balakrishna: “సర్కారు వారి పాట” దర్శకుడితో బాలయ్య సినిమా..

ఇదిలా ఉండగా, బాలయ్య తన నెక్ట్స్ సినిమా కోసం మాస్ రాజా రవితేజ సినిమాలోని ఓ టైటిల్‌ను సగానికి వాడుకోబోతున్నాడట. దీనికి సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలయ్య నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో అనిల్ రావిపూడి ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. రవితేజ నటించిన ‘‘రామారావు ఆన్ డ్యూటీ’’ అనే సినిమా టైటిల్ నుండి రామారావు పేరును వాడుకోబోతున్నాడట.

BalaKrishna: తన లైఫ్ లో ఊర్వశి ఎవరో? రాక్షసి ఎవరో? బయటపెట్టిన బాలయ్య..

అందుకే ఈ సినిమాకు ‘‘రామారావు గారు’’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తుందట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో అందాల భామ శ్రీలీల నటిస్తోండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.