Apoorva Sahodarulu : బాలయ్య ఫస్ట్ డ్యుయెల్ రోల్ సినిమాకు 35 ఏళ్లు
యువరత్న నందమూరి బాలకృష్ణ, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘అపూర్వ సహోదరులు’..

Apoorva Sahodarulu 35
Apoorva Sahodarulu: యువకిశోరం నందమూరి బాలకృష్ణ, విజయశాంతి, భానుప్రియ హీరో హీరోయిన్లుగా.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో యాక్షన్ హిట్ ఫిలిం.. ‘అపూర్వ సహోదరులు’.. రాఘవేంద్ర రావు హోమ్ బ్యానర్ ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ సంస్థలో ఆయన సోదరుడు కె.కృష్ణ మోహన రావు నిర్మించారు.

1986 అక్టోబర్ 9 న విడుదలైన ‘అపూర్వ సహోదరులు’ చిత్రం 2021 అక్టోబర్ 9 నాటికి 35 సంవత్సరాలు పూర్తవుతుంది. బాలకృష్ణ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇదే కావడం విశేషం. అరుణ్ కుమార్, రాము అనే క్లాస్, మాస్ క్యారెక్టర్లలో బాలయ్య తన నటనతో మెప్పించారు.
Nandamuri Balakrishna : ‘ఆహా’ లో బాలయ్య అదిరిపోయే టాక్ షో..!
అరుణ్ కుమార్‌కి జోడీగా విజయశాంతి, రాముకి జతగా భానుప్రియ నటించారు. రంగనాథ్, రాళ్లపల్లి, రావు గోపాల రావు, అల్లు, నూతన్ ప్రసాద్, నిర్మల, అన్నపూర్ణ తదితరులు మిగతా కీలకపాత్రల్లో నటించిన ‘అపూర్వ సహోదరులు’ మంచి కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. 1986 దసరాకు విడుదలైన సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించి మంచి వసూళ్లతో శతదినోత్సవం జరుపుకుంది.
Balakrishna : టైసన్ కోసం బాలయ్య..!
సునీల్ వర్మ కథ, సత్యానంద్ మాటలు అందించారు. చక్రవర్తి కంపోజ్ చేసిన పాటలు అలరించాయి. కె.ఎస్. ప్రకాష్ కెమెరా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రంగా బాలయ్య కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది ‘అపూర్వ సహోదరులు’..