Akhanda: దీపావళికే బాలయ్య ఆగమనం.. అధికారిక ప్రకటనే బ్యాలెన్స్!

మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న హ్యాట్రిక్ సినిమా అఖండ. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అభిమానులు..

Akhanda: దీపావళికే బాలయ్య ఆగమనం.. అధికారిక ప్రకటనే బ్యాలెన్స్!

Akhanda

Akhanda: మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న హ్యాట్రిక్ సినిమా అఖండ. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే అఖండ నుండి వదిలిన పోస్టర్లు, టీజర్లు సినిమా మీద మరింత హైప్ పెంచేశాయి. ఇక, ఇప్పుడు ఎప్పుడెప్పుడు సినిమా తెరమీదకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి కావాల్సింది.

Sophie Choudry: సోఫీ నీ అందం అదరహో!

కానీ, అనుకోని కారణాల వలన షూటింగ్ వాయిదా పడుతూ ఆలస్యమైంది. ముందుగా ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్న షూటింగ్ ఆలస్యం కావడంతో దసరా బరినుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఒక ఫెస్టివల్ మిస్సయ్యిన ఈ సినిమా మరో ఫెస్టివల్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. దసరాకి రాలేని అఖండను దీపావళి రేస్ లో తీసుకురావాలని మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నట్లుగా వినిపిస్తుంది.

Pushpa: రిలీజ్ డేట్ ఇచ్చినా.. బన్నీ నుండి ప్రచారం లేదేంటి?

అన్నీ సక్రమంగా జరిగితే నవంబర్ 4న థియేటర్లలో బాలయ్య ఉగ్ర రూపం చూడనున్నారు. ఒకటి రెండు రోజులలో విడుదల తేదీపై అధికారిక ప్రకటన కూడా రానుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ విషయంలో రామ్ లక్ష్మణ్ అదిరిపోయే సన్నివేశాలను తీర్చిదిద్దారని చెప్తున్న ఈ సినిమాలో ఫారెస్ట్ లో యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు.