Balayya Sankranthi: కారంచేడులో బాలయ్య సంక్రాంతి సంబరాలు

ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.

10TV Telugu News

Balayya Sankranthi: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగువారి లోగిళ్ళు కళకళాడుతున్నాయి. ఊరూవాడా చిన్నాపెద్దా అందరు సంక్రాంతి సందడితో సంతోషంగా గడుపుతున్నారు. పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. రంగురంగుల రంగవల్లికలు, గగ్గిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల ఆటపాటలతో గ్రామాల్లో సందడి నెలకొంది. పలు ప్రాంతాల్లో కోడి పందాలు, ఎడ్ల పోటీలతో ప్రజలు సందడి చేస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. తన భార్య, కుమారుడు, బంధుగణంతో రెండు రోజుల క్రితమే ప్రకాశం జిల్లా కారంచేడులో నివసిస్తున్న తన సోదరి పురందేశ్వరి ఇంటికి చేరుకున్న బాలయ్య, ఎంతో ఉత్సాహంగా సంక్రాంతి వేడుకలు చేసుకున్నారు.

Also read: Balakrishna : గుర్రమెక్కిన ‘నటసింహం’.. నందమూరి ‘యువసింహం’..

శనివారం సంక్రాంతి సందర్భంగా కారంచేడులో ఎడ్ల బండిని తోలుతూ బాలకృష్ణ సందడి చేశారు. సంక్రాంతి ప్రత్యేకతను చాటేలా ఒంగోలు జాతి ఎడ్ల బండిపై చర్నకోల చెతబట్టిన బాలకృష్ణ కొద్దిసేపు ఎడ్ల బండి నడిపి సరదాపడ్డారు. బాలయ్య కుమారుడు మెక్షజ్ణ, దగ్గబాటి కుటుంభ సభ్యులను ఎడ్లబండిపై ఎక్కించుకుని ఎడ్ల బండిని తోలుకువెళ్లారు. తన బావ దగ్గుబాటి వెంకటేశ్వర్లుతో కలిసి సంక్రాంతి విశేషాలు పంచుకున్నారు బాలకృష్ణ. కాగా కుటుంబ సభ్యులతో కలిసి బాలకృష్ణ చేస్తున్న సంక్రాంతి హడావిడిపై నందమూరి అభిమానులు సంబరపడిపోతున్నారు. బాలయ్య సంక్రాంతి స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ శుభాకాంక్షలు తెలువుకుంటున్నారు.

Also read: Indian Govt.: విదేశీ హెలికాప్టర్, క్షిపణి దిగుమతి ఒప్పందాలను రద్దు చేసిన కేంద్రం

×