Balakrishna: బాక్సాఫీస్‌కు చుక్కలు చూపెడుతున్న బాలయ్య.. స్ట్రాటెజీ మామూలుగా లేదుగా!

నందమూరి బాలకృష్ణ ఇటీవల బాక్సాఫీస్ వద్ద వరుసగా విజయాలను అందుకుంటూ మిగతా హీరోలకు స్పూర్తిగా నిలుస్తున్నాడు. గతంలో బాలయ్య సినిమాలు రొటీన్ కమర్షియల్ కథలతో రావడం.. వాటిని ప్రేక్షకులు తిరస్కరించడం జరిగేవి. అయితే కరోనా తరువాత ఆయన ‘అఖండ’ సినిమాతో అందుకున్న విజయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ వెంటనే ఆయన సినిమా చేసి రిలీజ్ చేసుండొచ్చు. కానీ, సగటను ప్రేక్షకుడికి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఖచ్చితంగా తన సినిమాలో ఉండే విధంగా బాలయ్య తన స్ట్రాటెజీని మార్చుకున్నారు.

Balakrishna: బాక్సాఫీస్‌కు చుక్కలు చూపెడుతున్న బాలయ్య.. స్ట్రాటెజీ మామూలుగా లేదుగా!

Balakrishna Changed His Strategy And Scoring Back To Back Hits

Balakrishna: నందమూరి బాలకృష్ణ ఇటీవల బాక్సాఫీస్ వద్ద వరుసగా విజయాలను అందుకుంటూ మిగతా హీరోలకు స్పూర్తిగా నిలుస్తున్నాడు. గతంలో బాలయ్య సినిమాలు రొటీన్ కమర్షియల్ కథలతో రావడం.. వాటిని ప్రేక్షకులు తిరస్కరించడం జరిగేవి. అయితే కరోనా తరువాత ఆయన ‘అఖండ’ సినిమాతో అందుకున్న విజయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ వెంటనే ఆయన సినిమా చేసి రిలీజ్ చేసుండొచ్చు. కానీ, సగటను ప్రేక్షకుడికి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఖచ్చితంగా తన సినిమాలో ఉండే విధంగా బాలయ్య తన స్ట్రాటెజీని మార్చుకున్నారు.

Balakrishna : గొప్ప మనసు చాటుకున్న బాలకృష్ణ..

ఇప్పుడు ఇదే స్ట్రాటెజీ ఆయనకు బాగా కలిసొస్తుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అఖండ సినిమాతో బాలయ్య అందుకున్న విజయం ప్రతీ ప్రేక్షకుడు ఎంజాయ్ చేశాడు. దీంతో తన నెక్ట్స్ మూవీని కూడా కామన్ ఆడియెన్స్ ఆనందించే విధంగా ఉండాలని దర్శకులకు అల్టిమేటం ఇచ్చాడట బాలయ్య. అందుకే వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో ఈ సినిమా హిట్ కావాలని కోరుకోవడం లేదని.. ఖచ్చితంగా హిట్ అవుతుందని బాలయ్య అంత కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఇక బాలయ్య తన నటనలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

ఇక కథ రొటీన్‌గా ఉన్నప్పటికీ తనదైన స్ట్రాటెజీతో బాలయ్య వీరసింహారెడ్డి మూవీని తన భుజాలపై మోసి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపిన విధానం ప్రశంసనీయం. ఇలా సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపించేందుకు బాలయ్య పడుతున్న తాపత్రయం నిజంగా హర్షనీయం. ఇక ప్రస్తుతం బాలయ్య మరో వైవిధ్యమైన పాత్రలో నటిస్తుండటంతో తన నెక్ట్స్ మూవీ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.