Balakrishna : చెత్త సినిమాని అద్భుతంగా చేసేది వాళ్ళే.. మంచి సినిమాని చెడగొట్టేది వాళ్ళే.. బాలకృష్ణ!

కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటించిన వేద.. ఈ నెల 10న తెలుగులో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించగా బాలకృష్ణ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ..

Balakrishna : చెత్త సినిమాని అద్భుతంగా చేసేది వాళ్ళే.. మంచి సినిమాని చెడగొట్టేది వాళ్ళే.. బాలకృష్ణ!

Balakrishna music director editor

Balakrishna : ఇటీవల కాలంలో కన్నడ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. దీంతో ఇతర భాషల్లో శాండిల్‌వుడ్ చిత్రాలకు ఆదరణ పెరుగుతూ వస్తుండడంతో కన్నడ మేకర్స్ తమ సినిమాలను పక్క ఇండస్ట్రీలో కూడా రిలీజ్ చేసి సక్సెస్ ని అందుకుంటున్నారు. తాజాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన చిత్రం ‘వేద’ తెలుగులో రిలీజ్ కి సిద్దమవుతుంది. గత ఏడాది డిసెంబర్ 23న కన్నడలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాని ఫిబ్రవరి 10న తెలుగులో విడుదల చేస్తున్నారు.

Balakrishna : మొన్న చిరు, ఇవాళ బాలయ్య.. డైరెక్టర్లకు చురకలు!

దీంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (ఫిబ్రవరి 7) హైదరాబాద్ మాదాపూర్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. శివరాజ్ కుమార్ నాకు తమ్ముడు లాంటివాడు. తనకి కళామతల్లి ఆశీస్సులు ఉండాలని ఒక అన్నగా కోరుకుంటున్నా. నా మరదలు, తన భార్య గీతని ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ మూవీ చేస్తున్న శివరాజ్ కుమార్ ని అభినందిస్తున్నా. ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముందుండాలి.

ఇక డైరెక్టర్ హర్షకి శివతో ఇది నాలుగో సినిమా. అలాగే సంగీత దర్శకుడు రవి బస్రూర్, ఎడిటర్ హరీష్ కొమ్మే ఈ మూవీకి పని చేశారు. వాళ్లిద్దరూ ఇక్కడ లేకపోవచ్చు కానీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే.. ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ వెన్నుముక్క లాంటి వారు. దర్శకుడు, హీరో ఇతర నటీనటులు వీరందరూ చేసే అన్ని తప్పులను వీరే సరి చేస్తారు. ఒక చెత్త సినిమాని అద్భుతంగా చేసేది వాళ్ళే, ఒక మంచి సినిమాని చెడగొట్టేది వాళ్ళే అంటూ కామెంట్ చేశాడు. అలాగే ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులకు తన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తెలుగులో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న రాధా కృష్ణకి అభినందనలు తెలియజేశాడు.