Balakrishna : తారకరత్నకు జరిగినట్లు ఎవరికీ జరగకూడదని.. మరోసారి బాలయ్య మంచితనం..
ప్రస్తుతం బాలకృష్ణ తన నియోజకవర్గమైన హిందూపూర్ లో ఓ హాస్పిటల్ కట్టిస్తున్నారు. ఈ హాస్పిటల్ లో ఓ బ్లాక్ కు తారకరత్న పేరు పెట్టారు. అంతే కాకుండా తారకరత్నకు గుండెపోటుతో మరణించడంతో హిందూపూర్ లో నిర్మించే హాస్పిటల్ లో...................

Balakrishna decide help poor patients who have heart issues in the name of Tarakarathna
Balakrishna : ఇటీవల నందమూరి తారకరత్న(Tarakarathna) అకస్మాత్తుగా గుండెపోటుకు గురయి కొన్ని రోజులు చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. తారకరత్న మరణం నందమూరి కుటుంబ సభ్యులు, టిడిపి(TDP) కార్యకర్తల్లో తీవ్ర విషాదం నెలకొల్పింది. ఇక తారకరత్న అంతిమ కార్యక్రమాలన్నీ బాలకృష్ణ(Balakrishna) దగ్గరుండి చూసుకున్నారు. తారకరత్న, బాలకృష్ణ చాలా క్లోజ్ కావడంతో బాలయ్యే అన్ని దగ్గరుండి చూసుకొని తారకరత్న భార్య, పిల్లలకు కూడా భరోసా ఇచ్చారు.
ఇటీవల తారకరత్న భార్య బాలకృష్ణే మాకు సపోర్ట్ గా నిలిచారని సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టింది. ఇక బాలయ్య సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. తన తల్లి క్యాన్సర్ తో చనిపోవడంతో ఆవిడలా ఎవరూ బాధపడకూడదని బసవతారకం హాస్పిటల్ కట్టించి ఎంతో మందికి కొన్ని సంవత్సరాలుగా ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు బాలయ్య. కరోనా సమయంలో కూడా ఎంతోమందికి వైద్య సేవలు అందించారు బాలకృష్ణ. తాజాగా మరో మంచి నిర్ణయం తీసుకున్నారు.
Kota Srinivasa Rao : నేను బ్రతికే ఉన్నాను.. సోషల్ మీడియాలో మరణవార్త పై కోటశ్రీనివాస రావు రియాక్షన్..
ప్రస్తుతం బాలకృష్ణ తన నియోజకవర్గమైన హిందూపూర్ లో ఓ హాస్పిటల్ కట్టిస్తున్నారు. ఈ హాస్పిటల్ లో ఓ బ్లాక్ కు తారకరత్న పేరు పెట్టారు. అంతే కాకుండా తారకరత్నకు గుండెపోటుతో మరణించడంతో హిందూపూర్ లో నిర్మించే హాస్పిటల్ లో గుండె జబ్బులు ఉన్న పేదలకు తారకరత్న పేరు మీద ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించారు బాలకృష్ణ. అంతే కాక ఆ హాస్పిటల్ కి వచ్చే పిల్లలకు ఉచితంగా భోజనాలు, మందులు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక హాస్పిటల్ లో కోట్లు ఖర్చుపెట్టి కావాల్సిన పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని తారకరత్న భార్య అలేఖ్య కూడా అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తారకరత్న పేరు నిలిచిపోయేలా చేస్తున్న బాలయ్యని మరోసారి అందరూ అభినందిస్తున్నారు. బాలయ్యది మంచి మనసు అంటూ మరోసారి అభిమానులు, కార్యకర్తలు మెచ్చుకుంటున్నారు.
View this post on Instagram