Balakrishna : బాలకృష్ణ కొత్త యాడ్ చూశారా? బంగారం, వజ్రాలతో మెరిపించిన బాలయ్య..

ఇటీవలే వేగ జువెల్లర్స్ అనే బ్రాండ్ కి బాలయ్య, ప్రగ్య మీద ఓ యాడ్ షూట్ చేశారు. అలాగే బాలకృష్ణతో ఓ ఫోటోషూట్ కూడా చేసి వేగ జువెల్లర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ మీద యాడ్ ని భారీగా తెరకెక్కించి.................

Balakrishna : బాలకృష్ణ కొత్త యాడ్ చూశారా? బంగారం, వజ్రాలతో మెరిపించిన బాలయ్య..

Balakrishna done a commercial ad goes viral

Balakrishna :  బాలకృష్ణ వరుసగా అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మరో వైపు అన్‌స్టాపబుల్ షో రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇన్ని రోజులు యాడ్స్ చేయని బాలయ్య బాబు కూడా ఇటీవల యాడ్స్ చేయడం కూడా మొదలుపెట్టాడు. కొన్ని రోజుల క్రితం ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి యాడ్ చేశారు. ఆ యాడ్ లో చాలా స్టైలిష్ గా కనిపించి అదరగొట్టేసారు. తాజాగా బాలయ్య బాబు ఓ జువెల్లర్స్ బ్రాండ్ కి యాడ్ చేశారు.

ఇటీవలే వేగ జువెల్లర్స్ అనే బ్రాండ్ కి బాలయ్య, ప్రగ్య మీద ఓ యాడ్ షూట్ చేశారు. అలాగే బాలకృష్ణతో ఓ ఫోటోషూట్ కూడా చేసి వేగ జువెల్లర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ మీద యాడ్ ని భారీగా తెరకెక్కించి ఆదివారం నాడు థియేటర్స్ లో ప్రీమియర్ వేసి రిలీజ్ చేశారు. మొదటి సారి ప్రీమియర్ వేసిన యాడ్ గా చరిత్ర సృష్టించింది.

Janhvi Kapoor : #NTR30 అప్డేట్.. అనుకున్నదే అయింది.. ఎన్టీఆర్ సినిమాలో జాన్వీనే హీరోయిన్..

వేగ జువెల్లర్స్ కోసం రెండు యాడ్స్ చేశారు బాలకృష్ణ. ఒక యాడ్ లో బాలకృష్ణ, ప్రగ్య పట్టుబట్టలు, హారాలు వేసుకొని వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించినట్లు, దానికి అన్ని వేగా జువెల్లర్స్ బ్రాండ్ నగలు వాడినట్టు చూపించారు. మరో యాడ్ లో ఓ పెళ్ళిలో పెళ్లి కూతురికి వేగా జువెల్లర్స్ బ్రాండ్ నగలు వాడినట్టు బాలకృష్ణ వాటి గురించి చెప్తున్నట్టు చూపించారు. ఈ రెండు యాడ్స్ కూడా భారీగా చిత్రీకరించారు. ఇప్పుడు ఈ యాడ్స్ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ యాడ్స్ చూసి బాలయ్య అభిమానులు సంతోషిస్తూ మరిన్ని యాడ్స్ బాలకృష్ణ చేయాలని కోరుకుంటున్నారు.