NBK108: బాలయ్య కోసం అనిల్ రావిపూడి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడా..?

నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేసింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.

NBK108: బాలయ్య కోసం అనిల్ రావిపూడి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడా..?

Balakrishna Dual Role In NBK108 Movie

NBK108: నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేసింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.

NBK108 : మరోసారి బాలయ్యకి జంటగా హనీ రోజ్..

ఈ సినిమా అందుకున్న సక్సెస్ కారణంగా బాలయ్య తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే స్టార్ట్ చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌లో బాలయ్య ఫిబ్రవరి నెలలో జాయిన్ అవబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని విధంగా చూపించబోతున్నానంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. దీంతో ఈ సినిమాలో బాలయ్య ఎలాంటి లుక్‌లో కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఇప్పుడు ఈ సినిమాలోనూ బాలయ్య కోసం అనిల్ రావిపూడి ఓ పాత సెంటిమెంట్‌ను ఫాలో అవబోతున్నాడని తెలుస్తోంది.

NBK108 : రాయలసీమ కాదు తెలంగాణ కథతో NBK108.. అనిల్ రావిపూడి!

NBK108 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య డ్యుయెల్ రోల్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఇటీవల నటించిన ‘వీరసింహారెడ్డి’లోనూ డ్యుయెల్ రోల్‌లో నటించాడు. దీంతో మరోసారి అదే సెంటిమెంట్‌ను అనిల్ రావిపూడి కూడా పట్టుకొస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. మరి నిజంగానే ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తాడా అనేది చూడాలి.