Aha : బుక్ రాసిన బాలయ్య.. ఆ అమ్మాయితో డ్యాన్స్ వేసి.. మళ్ళీ అన్‌స్టాపబుల్..

ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ లో గెస్ట్‌గా వచ్చి అలరించారు బాలకృష్ణ. బాలకృష్ణ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ జూన్ 10 రాత్రి 9 గంటలకు ఆహాలో.............

Aha : బుక్ రాసిన బాలయ్య.. ఆ అమ్మాయితో డ్యాన్స్ వేసి.. మళ్ళీ అన్‌స్టాపబుల్..

Balayya Babu

Balakrishna :  గత కొన్ని నెలల నుంచి బాలయ్య బాబు మంచి ఫామ్ లో ఉన్నారు. అఖండ సినిమాతో భారీ విజయం సాధించారు. ఇక అన్‌స్టాపబుల్ షోతో తనలోని మరో కోణాన్ని బయటకి తీసి అందర్నీ మెప్పించారు బాలయ్య. ఇక బయట కూడా తన మాటల్లో, చేతల్లో అదే ఫ్లో కంటిన్యూ చేస్తున్నారు. బాలయ్య బాబు ఫ్యాన్స్ తో పాటు, ప్రేక్షకులు కూడా అన్‌స్టాపబుల్ సీజన్ 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజగా బాలయ్యబాబు మరోసారి ఆహాలో మెరిశారు.

ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ లో గెస్ట్‌గా వచ్చి అలరించారు బాలకృష్ణ. బాలకృష్ణ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ జూన్ 10 రాత్రి 9 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో బాలకృష్ణ ఫుల్ ఎనర్జీతో కనిపించారు. అన్‌స్టాపబుల్‌ షోకి ఏమాత్రం తగ్గకుండా మరింత ఎనర్జీ చూపించి షోలో ఉన్న వారితో ఎంజాయ్ చేశారు.

ఈ ప్రోమోలో భం అఖండ అనే పాట పాడిన ఓ సింగర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి బాలయ్య బాబు.. పెళ్లి ఎప్పుడు అని అడగను, ఎందుకయ్యా పెళ్లి అని అడుగుతా అంటూ నీకో గిఫ్ట్ అని చెప్పి భార్యని ఏమార్చడం ఎలా అనే పుస్తకాన్ని రాసాను అంటూ ఇచ్చారు. అయితే ఇదంతా ఎపిసోడ్ లో భాగంగా సరదాగా చేశారు. ఆ తర్వాత సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే అనే పాట పాడిన అమ్మాయితో కలిసి స్టేజి మీద డ్యాన్సులు వేశారు బాలయ్య. మరో అమ్మాయిని పూజ హెగ్డేలా ఉన్నావు అంటూ సరదాగా ఆట పట్టించారు. షో మొత్తం పంచులు వేస్తూ, కామెడీ చేస్తూ అలరించారు.

Nazriya Nazim : అంటే సుందరం కోసం అద్భుతంగా తయారైన నజ్రియా..

దీంతో ప్రోమో అదిరిపోయింది. ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే ఇక ఎపిసోడ్ మోత మోగిపోద్ది అని అర్థమయి ప్రేక్షకులు బాలయ్య స్పెషల్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య వచ్చిన ఈ తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ ప్రోమో ట్రెండింగ్ లో ఉంది.