Akhanda : బాలయ్య ఫ్యాన్స్ రచ్చ షురూ..

నటసింహా నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మాస్ జాతరకు థియేటర్లను ముస్తాబు చేసిన ఫ్యాన్స్..

Akhanda : బాలయ్య ఫ్యాన్స్ రచ్చ షురూ..

Nbk Fans

Akhanda: నటసింహా నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిలిం.. మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ’ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. డిసెంబర్ 1 సాయంత్రం నుండి ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ పడనున్నాయి. పాండమిక్ తర్వాత ఇంత భారీగా రిలీజ్ అవుతున్న స్టార్ హీరో సినిమా బాలయ్యదే కావడం విశేషం.

Akhanda : రికార్డులు మొదలు.. సరైన మాస్ బొమ్మ పడితే.. బాలయ్యను ఆపడం కష్టం..

ఇక రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ బాలయ్య ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ భ్రమరాంబ, మల్లిఖార్జున థియేటర్లో బాలయ్య సినిమా బెన్‌ఫిట్ షోకి ఉండే సందడి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. స్వయంగా బాలయ్యే అభిమానులతో కలిసి సినిమా చూస్తారనే సంగతి తెలిసిందే.

ఇప్పటికే థియేటర్లను ఫ్లెక్సీలతో నింపేశారు ఫ్యాన్స్. బెన్‌ఫిట్ షోలకు పర్మిషన్ రావడం.. సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా ఎర్లీమార్నింగ్ రెండు షోలు వేసేలా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య యువసేన టీం సందడి అయితే మామూలుగా లేదసలు.. ఎన్‌బికె సేవాసమితి కర్నాటి కొండలరావు, విక్రమ్ సింహా అలాగే భానుప్రసాద్ యూత్‌కి చెందిన పవన్ మర్ని, పొట్లూరి రామకృష్ణ, పొట్లూరి రాజేష్, బాలయ్య బాబు కార్తీక్ తదితరులు థియేటర్స్ వద్ద భారీ ఫ్లెక్సీలతో హంగామా స్టార్ట్ చేశారు.

Nbk Sevasamithi