Pushpa-Acharya: బన్నీ కోసం బాబాయ్.. చిరు కోసం అబ్బాయ్!

కరోనా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో హెల్పింగ్ సెంటిమెంట్స్ బాగా పెరిగాయి. సినిమా గెలవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్న బడా స్టార్స్.. అంతా కలిసి అందరి సినిమాలు..

10TV Telugu News

Pushpa-Acharya: కరోనా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో హెల్పింగ్ సెంటిమెంట్స్ బాగా పెరిగాయి. సినిమా గెలవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్న బడా స్టార్స్.. అంతా కలిసి అందరి సినిమాలు చూడాలని కోరుకుంటున్నారు. గతంలో అప్పుడప్పుడు ఒకరికి ఒకరు సపోర్ట్ గా నిలబడితే.. ఇప్పుడు చిన్నా పెద్దా అనే సినిమా తేడా లేకుండా.. సినిమా ఏదైనా సినిమానే.. ఏ కుటుంబం నుండి వచ్చిన హీరో అయినా సరే ఒకరి కోసం ఒకరు అంటూ స్నేహ గీతాలు ఆలపిస్తున్నారు.

Akhanda: బాలయ్య సినిమాకు అఘోరాలు.. ఫ్యాన్స్‌తో ముచ్చట్లు!

ప్రస్తుతం థియేటర్లను ఊపేస్తున్న అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అసలు చూడగలమా అనేలా మెగా-నందమూరి కాంబినేషన్ సెట్టైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి వచ్చి అఖండకు ప్రమోషన్ చేసి పెట్టాడు. ఇక, ఇప్పుడు నందమూరి హీరోల వంతు వచ్చింది. అందుకే బాబాయ్ బాలయ్య.. అబ్బాయ్ ఎన్టీఆర్ మెగా హీరోలకు ప్రమోషన్ చేసే బాధ్యతను తీసుకున్నట్లుగా వినిపిస్తుంది. డిసెంబర్ 17న అల్లు అర్జున్ పుష్ప విడుదల కానుండగా త్వరలోనే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Mohan Babu: సిరివెన్నెల అంత్యక్రియలకు దూరమైన మంచు ఫ్యామిలీ.. కారణమిదే

ఈ ప్రీ రిలీజ్ వేడుకకు బాలకృష్ణను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయనున్నట్లు తెలుస్తుండగా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ మల్టీస్టారర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అబ్బాయ్ ఎన్టీఆర్ అటెండ్ కానున్నట్లుగా టాక్ నడుస్తుంది. మెగా ఫ్యామిలీతో ఇప్పుడు ఈ ఇద్దరికీ మంచి రాపో ఉండడంతో ఇది దాదాపుగా కన్ఫర్మ్ కావచ్చు. అదే జరిగితే తెలుగు ఇండస్ట్రీ మంచి సంబంధాలతో మరింత బలంగా తయారవడం గ్యారంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి.

×