NBK108: కూతురి కిడ్నాప్.. బాలయ్య మైండ్‌బ్లోయింగ్ యాక్షన్.. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఖాయం అంటోన్న అనిల్ రావిపూడి!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో 108వ సినిమాగా వస్తుండగా, ఈ మూవీలో బాలయ్య మునుపెన్నడూ కనిపించని గెటప్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ గతంలోనే తెలియజేసింది. దీంతో ఈ సినిమాలో బాలయ్య ఎలా కనిపిస్తాడా.. ఈ సినిమాను అనిల్ రావిపూడి ఎలాంటి కథతో తెరకెక్కిస్తున్నాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

NBK108: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో 108వ సినిమాగా వస్తుండగా, ఈ మూవీలో బాలయ్య మునుపెన్నడూ కనిపించని గెటప్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ గతంలోనే తెలియజేసింది. దీంతో ఈ సినిమాలో బాలయ్య ఎలా కనిపిస్తాడా.. ఈ సినిమాను అనిల్ రావిపూడి ఎలాంటి కథతో తెరకెక్కిస్తున్నాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
NBK108: అనిల్ రావిపూడి మూవీ కోసమే బాలయ్య గడ్డం పెంచుతున్నాడా..?
ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. కాగా, తాజాగా ఈ సినిమాలో ఓ కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్ర యూనిట్ చిత్రీకరణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల ఇటీవల జాయిన్ అయ్యింది. అయితే, ఇప్పుడు బాలయ్య-శ్రీలీల మధ్య సాగే ఓ ఎమోషనల్ ట్రాక్‌ను షూట్ చేస్తున్నారట. ఈ క్రమంలో తన కూతురు కిడ్నాప్‌కు గురయ్యిందని తెలుసుకున్న బాలయ్య, విలన్లతో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నట్లుగా చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో బాలయ్య చేస్తున్న ఫైట్ చూసి, చిత్ర యూనిట్ సైతం ఆశ్చర్యానికి గురవుతుందట.
NBK108: బాలయ్య సినిమాలో బాలీవుడ్ భామ విలనిజం..?
బాలయ్య లాంటి సీనియర్ హీరో ఇలా వీరోచితంగా ఫైట్స్ చేస్తుండటంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ ఈ సినిమాకు మరోసారి తనదైన మార్క్ అద్భుతమైన మ్యూజిక్‌ను అందిస్తున్నాడు. మరి ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.