Balakrishna : మరోసారి ఫ్యాక్షన్ సినిమాతో రాబోతున్న బాలయ్య బాబు

తెలుగు సినిమా పరిశ్రమలో ఫ్యాక్షన్ సినిమాలంటే బాలకృష్ణే తీయాలి అనే టాక్ ఉండేది. ఒకప్పుడు ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్నో హిట్ సినిమాలని అందించారు బాలకృష్ణ. సమర సింహా రెడ్డి, నరసింహ నాయుడు

10TV Telugu News

Balakrishna : తెలుగు సినిమా పరిశ్రమలో ఫ్యాక్షన్ సినిమాలంటే బాలకృష్ణే తీయాలి అనే టాక్ ఉండేది. ఒకప్పుడు ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్నో హిట్ సినిమాలని అందించారు బాలకృష్ణ. సమర సింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి, సీమ సింహం.. ఇలా ఎన్నో సినిమాలు ఫ్యాక్షన్ నేపథ్యంలో తీశారు బాలకృష్ణ. ఆ తర్వాత ఫ్యాక్షన్ సినిమాలకి దూరమయ్యారు. మళ్ళీ బాలయ్య బాబుని ఫ్యాక్షన్ సినిమాల్లో చూడాలని అభిమానానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అభిమానుల కోరిక నెరవేరబోతోంది.

ఇటీవలే బాలకృష్ణ అఖండ సినిమా షూట్ పూర్తి చేశారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే రానుంది. ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని‌తో సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. గోపీచంద్ హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే రవితేజతో ‘క్రాక్’ అంటూ భారీ విజయం సాధించాడు. ఈ సారి బాలకృష్ణతో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తీయబోతున్నట్టు సమాచారం.

Swetha Varma : బిగ్ బాస్ శ్వేతా వర్మకి ఇంత భారీ పారితోషకమా??

ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ, కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో, ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో సాగుతుందని తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్ గా కనపడనున్నారని సమాచారం. ఇందులో త్రిష హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.