NBK108: కొత్త లుక్‌లో కనిపించి స్టన్ చేసిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను NBK108 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందో ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.

Balakrishna In New Look From NBK108 Sets
NBK108: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను NBK108 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలయ్య వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలియజేసింది. ఇక ఈ సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందో ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.
NBK108: అన్న దిగుతుండు.. ఫస్ట్ లుక్‌తోనే రికార్డులకు ఎసరు పెడుతుండు!
కాగా, ఈ సినిమాలో బాలయ్య మరో లుక్‌లోనూ కనిపించనున్నారు. తాజాగా NBK108 షూటింగ్ సెట్స్ నుండి బాలయ్య కొత్త లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోల్లో బాలయ్య తెల్ల గడ్డంతో కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. మిగతా స్టార్ హీరోలు తెల్లగడ్డంతో కనిపించాలంటే ఆలోచిస్తారని.. కానీ బాలయ్యకు అలాంటి భయమే లేదని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. బాలయ్య మీసకట్టు, గాగుల్స్ పెట్టుకుని తెల్లగడ్డంతో కనిపించిన తీరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.
NBK108: బాలయ్య సినిమాలో జాయిన్ అయిన కాజల్..!
ఈ సినిమాలో తండ్రి పాత్రలో బాలయ్య నటిస్తుండగా, ఆయన కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపిస్తుంది. అందాల భామ కాజల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో పూర్తి చేయాలని చిత్ర యూనిట్ దూసుకెళ్తోంది.