బాలయ్య అందుకే కొట్టారు.. హీరో హర్ష్ క్లారిటీ..

10TV Telugu News

Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల హర్ష్ కానుమిల్లి హీరోగా పరిచయమవుతున్న ‘సెహరి’ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత సినిమా ఫంక్షన్‌కు హాజరైన బాలయ్య మూవీ టీంతో కలిసి సందడి చేశారు.


పనిలోపనిగా కరోనా వైరస్ కారణంగా సినీ ఇండస్ట్రీ పడుతున్న ఇబ్బందులు, మనుషులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి చెబుతూనే కొన్ని సూచనలు కూడా చేశారు. కరోనాకు ఇంత వరకు వ్యాక్సిన్‌రాలేదు. రాదు కూడా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య.. ఈ ఫంక్షన్‌లో తన ప్రవర్తన కారణంగా మరోసారి ట్రోలింగ్‌కి గురయ్యారు.
Imageమొబైల్ ఫోన్ విసిరికొట్టడం, ఫస్ట్‌లుక్ పోస్టర్ పట్టుకోబోతే హీరో చేతిని కొట్టడం, అంకుల్ అని పిలిచిన నిర్మాత (కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు) అద్వయ జిష్ణు రెడ్డిని గుర్రుగా చూడడం.. ఈ మూడు సంఘటనలతో నెటిజన్లు, యాంటీ ఫ్యాన్స్ బాలయ్యను ట్రోల్ చేస్తున్నారు.https://10tv.in/happy-birthday-lady-superstar-nayanthara/
ఈ నేపథ్యంలో ‘సెహరి’ హీర్ హర్ష్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ‘ఫస్ట్‌లుక్ లాంచ్ చేసేటప్పుడు నేను పోస్టర్‌ని ఎడమచేత్తో పట్టుకున్నాను.. అలా మంచిది కాదు, కుడి చేత్తో పట్టుకోవాలని చెప్తూ సరదాగా నా చేతిని తోశారు.. బాలకృష్ణ గారు మంచి మనసున్న వ్యక్తి’ అంటూ హర్ష్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడైనా బాలయ్య మీద ట్రోల్స్ ఆగుతాయో లేదో చూడాలి మరి.