NBK-RaviTeja: మాస్ రాజాతో బాలయ్య.. మరో క్రేజీ మల్టీస్టారర్?

అఖండ ఇచ్చిన బూస్టప్ తో వరస సినిమాలను ప్లాన్ చేస్తున్న నందమూరి నటసింహం బాలయ్య.. ఇప్పుడు గోపిచంద్ మలినేనితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

NBK-RaviTeja: మాస్ రాజాతో బాలయ్య.. మరో క్రేజీ మల్టీస్టారర్?

Nbk Raviteja

NBK-RaviTeja: అఖండ ఇచ్చిన బూస్టప్ తో వరస సినిమాలను ప్లాన్ చేస్తున్న నందమూరి నటసింహం బాలయ్య.. ఇప్పుడు గోపిచంద్ మలినేనితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది అలా ఉండగానే దర్శకుడు అనిల్ రావిపూడితో మరో సినిమా మొదలు పెట్టాల్సి ఉంది. అనిల్ ప్రస్తుతం ఎఫ్-3 పనులలో ఉండగా.. అది పూర్తవగానే బాలయ్య సినిమాను మొదలు పెట్టే ఛాన్స్ కనిపిస్తుంది.

Anil Ravipudi: దర్శకుడి ఆఫీస్‌కెళ్ళి మరీ ర్యాగింగ్ చేసిన తారక్!

సక్సెస్ ఫుల్ దర్శకుడిగా హైఓల్టేజ్ కథకు ఎంటర్ టైన్మెంట్ జోడించి తెరకెక్కించే అనిల్ తో సినిమా అనగానే బాలయ్య అభిమానులలో కూడా అంచనాలు మొదలవుతున్నాయి. కాగా.. ఇది మల్టీస్టారర్ సినిమా అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ కథ మల్టీస్టారర్ కథగానే బాలయ్యకి వినిపించిన ఒకే చేయించుకున్నారని.. ఇప్పుడు రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. త్వరలోనే ఫైనల్ టాక్స్ ముగించి సినిమా పట్టాలెక్కనుందని చెప్తున్నారు.

Anil Ravipudi with Balakrishna: అనిల్ రావిపూడి కల నెరవేరుతున్నట్లే!

అనిల్ ఇప్పటికే రవితేజతో ఒక సినిమా చేశాడు. రవితేజ టైమింగ్ గురించి అనిల్ రావిపూడికి అంచనాలున్నాయి. ఇక ఈ మధ్య ఆహా అన్ స్టాపబుల్ షోతో బాలయ్య టైమింగ్ ఏంటో అందరికీ తెలిసింది. దీంతో మాస్ రాజాతో బాలయ్య సినిమా అనగానే కొత్త అంచనాలు మొదలవుతున్నాయి. ఈ సినిమాలో కామెడీ డోస్ బాగా ఉంటుందని.. అదే మాదిరి హై ఓల్టేజ్ యాక్షన్ కూడా ఉండనుందని చెప్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ.. అసలు విషయం తెలియదు.