Akhanda: బాలయ్య మాస్ జాతర.. హ్యాట్రిక్ సక్సెస్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

పవర్ ఫుల్ డైలాగ్స్ తో మోత మోగిపోతున్న ధియేటర్లు.. పవర్ ఫుల్ పంచ్ లతో దద్దరిల్లిపోతున్న స్క్రీన్లు.. హ్యాట్రిక్ సక్సెస్ తో ఫుల్ ఖుష్ అవుతున్న అభిమానులు.. కలెక్షన్లతో నిండిపోతున్న..

Akhanda: బాలయ్య మాస్ జాతర.. హ్యాట్రిక్ సక్సెస్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

Akhanda Censor

Akhanda: పవర్ ఫుల్ డైలాగ్స్ తో మోత మోగిపోతున్న ధియేటర్లు.. పవర్ ఫుల్ పంచ్ లతో దద్దరిల్లిపోతున్న స్క్రీన్లు.. హ్యాట్రిక్ సక్సెస్ తో ఫుల్ ఖుష్ అవుతున్న అభిమానులు.. కలెక్షన్లతో నిండిపోతున్న బాక్సాఫీసులు.. ఇవీ అఖండ సినిమా రిలీజ్ అయిన తర్వాత అటు ధియేటర్లో, ఇటు ఫ్యాన్స్ లో కనిపిస్తున్నసీన్లు. బోయపాటి – బాలయ్య కాంబినేషన్లో మూడో సినిమాగా భారీగా రిలీజ్ అయిన అఖండ భారీ సక్సెస్ అందుకుని టాలీవుడ్ కి కొత్త ఊపు తెచ్చింది.

Sonakshi Sinha: మతులు పోగొడుతున్న బొద్దుగుమ్మ సోనాక్షి

సెకండ్ వేవ్ తర్వాత ధియేటర్లో ఈ రేంజ్ లో హడావిడి చేసిన సినిమా, ఈ లెవల్లో సందడి చేసిన సినిమా అన్ డౌటెడ్ గా అఖండ అనే చెప్పాలి. బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి భారీగా రిలీజ్ అయిన అఖండ.. అదిరిపోయే సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రీమియర్స్ దగ్గరనుంచే సక్సెస్ టాక్ సంపాదించుకున్న అఖండ.. అఖండ విజయం అందుకుంటోందనడం ఏమాత్రం డౌట్ లేదంటున్నారు ఫాన్స్.

RRR: జనవరి 7 విడుదల.. బాహుబలి కోటను బద్దలు కొట్టగలరా?

కోవిడ్ తర్వాత ధియేటర్లో సినిమాలు రిలీజ్ అయినా.. అఖండ రేంజ్ లో సక్సెస్ ని అందుకోలేకపోయాయి. బాలయ్య మరోసారి ధియేటర్లో మాస్ జాతరని చూపించారు. నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా.. మాస్ యాక్షన్, ఎక్స్ ప్రెషన్స్ తో కుమ్మేశాడు బాలయ్య. రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా కాకుండా అఖండలో 2 డిఫరెంట్ షేడ్స్ చూపించారు. హైఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో సినిమాని ఫుల్ గా ప్యాక్ చేసిన బాలకృష్ణ.. ఫ్యాన్స్ కి పండగలాంటి సినిమా ఇచ్చారు.

Evaru Meelo Koteeswarulu: ముహూర్తం ఫిక్స్.. కోటి ప్రశ్న ముందు అడిగేయ్ తారక్!

బాలయ్య తన స్టైల్ యాక్షన్ తో పాటు అఘోరాగా తన ఫుల్ ఫ్లెడ్జ్ యాక్షన్ తో ధియేటర్లో దడదడ లాడించేస్తున్నారు. బోయపాటి స్టైల్ హెవీ యాక్షన్ సీన్స్ కి తోడు.. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ తో దద్దరిల్లిపోతున్నాయి ధియేటర్లు. చాలా కాలం నుంచి సక్సెస్ కోసంవెయిట్ చేస్తున్న బాలయ్య కూడా అఖండతో అద్భుతమైన హిట్ అందుకున్నారు. అఖండగా బాలయ్య ఎంట్రీతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. హ్యాట్రిక్ మూవీ ఎలా ఉంటుందో, బాలయ్య పని అయిపోయిందేమో అని డౌట్ పడ్డ వాళ్లకి బంపర్ హిట్ తో ఆన్సర్ ఇచ్చారు బాలయ్య.