బాలయ్య కొత్త లుక్స్ అదుర్స్

  • Published By: venkaiahnaidu ,Published On : September 1, 2019 / 11:13 AM IST
బాలయ్య కొత్త లుక్స్ అదుర్స్

కేఎస్ రవికుమార్ డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ 105వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం స్టైలిష్ గా మారిన బాలయ్య లుక్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేసింది. బాలయ్య లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈసారి జోడీగా అభిమానుల ముందుకు వచ్చాడు బాలయ్య.

సోమవారం వినాయకచవితి సందర్భంగా ఇవాళ(సెప్టెంబర్-1,2019)బాలయ్య నటిస్తున్న సినిమాలోని రెండు పోస్టర్ లను మూవీ టీం రిలీజ్ చేసింది. ఇందులోని ఓ పోస్టర్ లో బాలయ్య రొమాంటిక్ యాంగిల్ ను చూపించారు. ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ ఆయన కనిపించారు. ఇక మరో పోస్టర్ లో సూటుబూటులో హ్యాండ్సమ్ లుక్ తో అదరగొట్టాడు. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా ఇది. హ్యాపీ మూవీప్ బ్యానర్ పై సి.కళ్యాణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు