Balakrishna : చిరు దర్శకుడితో బాలయ్య సినిమా.. నిజమేనా?

ప్రస్తుతం NBK108 చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న బాలయ్య.. తన తదుపరి సినిమాని చిరంజీవి దర్శకుడితో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ దర్శకుడు ఎవరంటే..

Balakrishna : చిరు దర్శకుడితో బాలయ్య సినిమా.. నిజమేనా?

Balakrishna next movie with chiranjeevi director Bobby Kolli

Balakrishna – Chiranjeevi : టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి (Chiranjeevi).. ఇప్పటి యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. 100 కోట్ల కలెక్షన్స్ అందుకుంటూ ఇప్పటికీ తామే నెంబర్ వన్ అంటున్నారు. ఈ ఏడాదిని బాలయ్య అండ్ చిరు.. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్స్ తో స్టార్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ వారివారి తదుపరి సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇక NBK108 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న బాలకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది.

NTR 100 Years : ఎన్టీఆర్ తన తల్లిని కాకుండా ‘అమ్మ’ అని పిలిచే వ్యక్తి ఎవరో తెలుసా?

తన తదుపరి సినిమా చిరంజీవికి వాల్తేరు వీరయ్యతో అదిరిపోయే హిట్ అందించిన బాబీ డైరెక్షన్ లో చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గాని, బాలయ్య అభిమానులకు మాత్రం ఈ న్యూస్ ఫుల్ కిక్ ఇస్తుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK108 పై కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ పోస్టర్స్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.

NTR 100 Years : ఎన్టీఆర్ తీరని కోరికగా ఆ సినిమా మిగిలిపోయింది.. ఏంటది?

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల వల్ల ఈ మూవీ షూటింగ్ కి కొంచెం బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. ఈ సినిమా తెలంగాణ బ్యాక్‌డ్రాప్ తో తెరకెక్కుతుంది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) బాలయ్యకి జోడిగా కనిపించబోతుంది. మరో హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస సక్సెస్ ల్లో ఉన్న బాలయ్య.. ఈ మూవీతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకుందామని ప్లాన్ చేస్తున్నాడు.