Unstoppable : పవన్ అన్‌స్టాపబుల్ 2 ప్రోమో.. పక్కా పొలిటికల్ ఎపిసోడ్.. ఏపీలో పొలిటికల్ హీట్ ఖాయం..

ఈ ప్రోమో చూసిన తర్వాత చాలా వరకు ఇది పొలిటికల్ ఎపిసోడ్ లాగే ఉండబోతుందని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య అన్ని స్ట్రైట్ ప్రశ్నలు పొలిటికల్ కి సంబంధించి అడిగారు. ప్రోమోలో.........

Unstoppable : పవన్ అన్‌స్టాపబుల్ 2 ప్రోమో.. పక్కా పొలిటికల్ ఎపిసోడ్.. ఏపీలో పొలిటికల్ హీట్ ఖాయం..

Balakrishna Pawan Kalyan Unstoppable episode part 2 promo released

Unstoppable :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా హిట్ అయి ముగియగా ఇప్పుడు అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ కూడా గ్రాండ్ గా ముగిస్తున్నారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు.

బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ ఆద్యంతం బాలయ్య – పవన్ నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. ఇక ఇప్పటికే బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తామని ప్రకటించగా తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు.

ఈ ప్రోమో చూసిన తర్వాత చాలా వరకు ఇది పొలిటికల్ ఎపిసోడ్ లాగే ఉండబోతుందని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య అన్ని స్ట్రైట్ ప్రశ్నలు పొలిటికల్ కి సంబంధించి అడిగారు. ప్రోమోలో.. పవన్ ఎక్కువగా జేబులో చేతులు పెట్టుకుంటున్నావు? ఎవర్ని కొట్టకుండా ఆపుకోవడానికా అని అడిగారు బాలయ్య. ఇటీవల పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్ళేటప్పుడు కార్ మీద కూర్చొని వెళ్లగా అది వైరల్ అయింది. ఆ ఫోటో చూపించి బాలయ్య దాని గురించి అడిగారు. దీనికి పవన్ కార్ లో వెళ్లొద్దు, కార పైన వెళ్లొద్దు, బయటకి రాకూడదు.. చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అంటూ ఏపీ ప్రభుత్వంపై కౌంటర్లు వేశారు. అధికార యంత్రంగం హద్దులు దాటుతుందని అన్నారు. అసలు పార్టీ ఎందుకు స్టార్ట్ చేశావు అని అడిగారు బాలకృష్ణ. అలాగే తెలుగుదేశంలో జాయిన్ అవ్వొచ్చుగా అని డైరెక్ట్ గా అడగటంతో అంతా షాక్ అయ్యారు. ఇప్పటి పాలిటిక్స్ లో ఆధిపత్య ధోరణి ఎక్కువైంది అని పవన్ చెప్పాడు. నీ మ్యానిఫెస్టో జనాల్లోకి వెళ్ళలేదు ఏమో, నీ ఫ్యాన్స్ ని ఓట్లుగా ఎందుకు మలుచుకోలేకపోతున్నావు అని అడిగాడు బాలయ్య. ఎవరన్నా ఎదుగుతుంటే వాళ్ళని తొక్కాలని చూస్తారు అని పవన్ అన్నారు. నువ్వేం తప్పు చేశావని నీ మీద కేసులు పెట్టారు అని బాలకృష్ణ అడగగా ఏకంగా అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టారు అని చెప్పారు పవన్. ఇలా మొత్తం పొలిటికల్ కి సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలే ఎక్కువగా ఉండేలా ఉన్నాయి ఎపిసోడ్ లో.

అలాగే కరోనా వల్ల ఇద్దరి కొడుకులని పోగొట్టుకున్న ఓ పెద్దావిడకి పవన్ కొడుకుగా నిలబడటంతో ఆమె వచ్చి పవన్ సీఎం అయ్యాకే చస్తాను, పవన్ నా కొడుకు అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది. ఆలాగే చివర్లో డైరెక్టర్ క్రిష్ కూడా వచ్చాడు. దీంతో హరిహరవీరమల్లు సినిమా గురించి కూడా ఏమైనా మాట్లాడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే పవన్ సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాలకి రావాలని అక్కడ ఉన్న అభిమానులు కోరుకున్నారు. అణువణువునా ఇరుకున పెడితే అణుబాంబు అవుతుంది అని బాలయ్య తనదైన డైలాగ్స్ తో పవన్ కి వైసీపీ ప్రభుత్వం పెట్టే ఇబ్బందులను ఉద్దేశించి అన్నారు.

Buttabomma Review : బుట్టబొమ్మ రివ్యూ.. రీమేక్ సినిమా అయినా.. వాళ్ళిద్దరికోసం చూడొచ్చు..

దీంతో ఈ ఎపిసోడ్ ప్రోమోలోనే ఈ రేంజ్ లో పొలిటికల్ టాపిక్స్ ఉందంటే ఇక ఎపిసోడ్ రిలీజయితే ఏపీలో పొలిటికల్ రచ్చ ఖాయం అంటున్నారు. అసలు బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూట్ జరిగినప్పుడే వైసీపీ నాయకులు విమర్శించారు. మరి ఈ ఎపిసోడ్ రిలీజయ్యాక వైసీపీ నాయకులు ఏ రేంజ్ లో పవన్, బాలకృష్ణపై విమర్శలు చేస్తారో చూడాలి. ఈ ఎపిసోడ్ ఏపీలో పొలిటికల్ గా ఎంత రచ్చ సృష్టిస్తుందో చూడాలి మరి. ఇక ఈ ఎపిసోడ్ ని ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తామని ఆహా టీం ప్రకటించింది. దీంతో ఈ ఎపిసోడ్ కోసం బాలయ్య, పవన్ అభిమానులతో పాటు ఏపీలోని రాజకీయ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు.