Balakrishna : ఏఎన్నార్ నాకు బాబాయ్ లాంటి వారు.. ఫ్లోలో వచ్చిన మాటలని వివాదాస్పదం చేశారు..

తాజాగా నేడు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు ఈ వివాదం గురించి అడగగా బాలకృష్ణ స్పందించారు. ఈ ఇష్యూపై బాలకృష్ణ స్పందిస్తూ................

Balakrishna : ఏఎన్నార్ నాకు బాబాయ్ లాంటి వారు.. ఫ్లోలో వచ్చిన మాటలని వివాదాస్పదం చేశారు..

Balakrishna reacts on Akkineni Issue

Balakrishna :  ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ మాట్లాడుతూ అనుకోకుండా సీనియర్ హీరోల పేర్లు తీసుకొచ్చి రామారావు, రంగారావు, అక్కినేని, తొక్కినేని.. అంటూ మాట్లాడారు. అయితే ఇది కావాలని మాట్లాడింది కాదని ఆ స్పీచ్ చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. కానీ ఫ్లోలో బాలకృష్ణ అలా మాట్లాడటంతో అక్కినేని అభిమానులు సీరియస్ అయి బాలయ్యపై విమర్శలు, ట్రోల్స్ చేశారు. దీనిపై అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా స్పందిస్తూ.. నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడం, మనల్ని మనం కించపరుచుకోవటమే అంటూ ట్వీట్ చేశారు. దీంతో అక్కినేని అభిమానులు బాలయ్య క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు.

SV Rangarao Grand Sons : బాలకృష్ణ ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.. బాలయ్యని సపోర్ట్ చేసిన ఎస్వీ రంగారావు మనవళ్లు..

తాజాగా నేడు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు ఈ వివాదం గురించి అడగగా బాలకృష్ణ స్పందించారు. ఈ ఇష్యూపై బాలకృష్ణ స్పందిస్తూ.. అవి యాదృశ్చికంగా అన్న మాటలే తప్ప ఆయనను కించపరచటానికి కాదు. ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటి వారు. ఏఎన్నార్ ని నేను బాబాయ్ అని పిలుస్తాను. బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం నేర్చుకున్నాను. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు. ఎన్టీఆర్‌ పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికే అందించాము. అది గుర్తుంచుకోవాలి. నాకు బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంది. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను అని అన్నారు. మరి దీనిపై అక్కినేని అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.