NBK108: బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు బాలయ్య రోరింగ్ ట్రీట్!

అఖండతో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలయ్య. ఫుల్ స్వింగ్ లో మలినేని సినిమాను కానిస్తున్నారు.

NBK108: బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు బాలయ్య రోరింగ్ ట్రీట్!

Anil Ravipudi With Balakrishna

NBK108: అఖండతో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలయ్య. ఫుల్ స్వింగ్ లో మలినేని సినిమాను కానిస్తున్నారు. ఇప్పుడదే మూడ్ లో మరో డైరెక్టర్ కు పని చెప్పడానికి రెడీ అయ్యారు. డేట్ కూడా ఫిక్స్ చేసుకుని ఆ దర్శకుడితో సినిమా మొదలెట్టడానికి భారీ స్కెచ్ వేశారు. ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం.

NBK-RaviTeja: మాస్ రాజాతో బాలయ్య.. మరో క్రేజీ మల్టీస్టారర్?

జూన్ 10.. బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు బాలయ్య రోరింగ్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. అనిల్ రావిపూడితో తాను చేయబోయే సినిమా సంగతులను ఆరోజే రివీల్ చేయబోతున్నారు. బాలయ్య 108వ సినిమా కోసం ఇప్పటికే అనిల్ ఓ ఫెంటాస్టిక్ స్టోరీని రెడీ చేశారు. ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్ మోస్ట్ పూర్తయినట్టే. ఇక ఆలస్యం చేయకుండా ప్రాజెక్ట్ ను జూన్ 10న ప్రకటించేసి సెప్టెంబర్ లో మొదలుపెట్టాలనుకుంటున్నారు.

Gopichand Malineni : NBK 107 సెట్‌లో గోపీచంద్ మలినేని బర్త్‌డే సెలెబ్రేషన్స్

బాలయ్య ఇమేజ్.. అనిల్ రావిపూడి స్టైల్లో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా స్ట్రిప్ట్ ను రెడీ చేశారు. ఈ సినిమాలో నందమూరి నటసింహం సరసన అనిల్ ఆస్థాన హీరోయిన్లు నటించబోతున్నారు. తమన్నా, మెహ్రీన్ పిర్జానాలనే బాలకృష్ణ మూవీలోనూ అనీల్ రిపీట్ చేయబోతున్నాడు. ఇక అన్నింటికంటే హాట్ న్యూస్ ఏంటంటే.. మాస్ రాజా రవితేజ కూడా ఇందులో ఓ ఇంపార్టెంట్ రోల్ చేసే ఛాన్స్ ఉంది. ఆహా అన్ స్టాపబుల్ లోనే వీళ్లిద్దరి మధ్య గ్యాప్ లేదని తేల్చేసిన బాలయ్య, రవితేజ.. ఇప్పుడీ మూవీ కోసం కలిస్తే మాస్ ఫ్యాన్స్ కు పండుగే.

NBK107: బాలయ్య ద్విపాత్రాభినయం.. మరోసారి తండ్రికొడుకులుగా?

అన్ స్టాపబుల్, అఖండ సక్సెస్ తర్వాత మలినేని గోపీచంద్ డైరెకక్షన్ లో బాలయ్య నటిస్తున్నారు. తెలంగాణలోని సిరిసిల్ల ప్రాంతంలో ఎక్కువ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ మూవీని ఆగస్ట్ ఎండ్ వరకు కంప్లీట్ చేయాలనేది మేకర్స్ ఆలోచన. ఇక ఈ దసరాకు మలినేని సినిమాను తీసుకొచ్చి.. అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది బాలయ్య ప్లాన్.