Akhanda : నన్ను, బోయపాటిని దేవుడే కలిపాడు: బాలకృష్ణ

బోయపాటి శ్రీను, నా కాంబినేషన్ హాట్రిక్. మా కలయిక జన్మజన్మలది. మా ఇద్దర్ని ఆ దేవుడే కలిపాడు. భగవంతుడు మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది....

Akhanda : నన్ను, బోయపాటిని దేవుడే కలిపాడు: బాలకృష్ణ

Akhanda

Balakrishna :  నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా నిన్నటితో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అర్థ శతదినోత్సవ వేడుకని జరుపుకున్నారు. గురువారంనాడు సాయంత్రం హైదరాబాద్లోని ఆర్.టి.సి. క్రాస్ రోడ్లో ఉన్న సుదర్శన్ థియేటర్లో ‘అఖండ’ 50 రోజుల వేడుకని జరుపుకున్నారు చిత్ర బృందం. అభిమానుల కేరింతల మధ్య, ప్రేక్షకుల నడుమ ఈ వేడుకని నిర్వహించారు.

ఈ వేడుకలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ”ఆర్.టి.సి. క్రాస్ రోడ్ కి వస్తుంటే మా రామకృష్ణ స్టూడియో జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో స్టూడియోలో నాన్నగారికోసం టిఫిన్ తీసుకువచ్చేవాడిని. అలాగే నా సమరసింహారెడ్డి శతదినోత్స వేడుక కూడా ఇక్కడే జరిగింది. ఇక ‘అఖండ’ సినిమా విజయం ప్రేక్షకులు ఇచ్చిన విజయం. మా టీమ్ సమిష్టి కృషి. శివుడు భక్తుడిగా నేను చేసిన అఖండలోని పాత్ర నాన్నగారు చేసిన పాత్రలు గుర్తుచేసుంటూ చేశాను. మొన్ననే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు ‘అఖండ’ పండుగ ఇది. కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అనుకున్న సమయంలో తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చారు. ఇది ఆంధ్ర, తెలంగాణే కాదు కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా అలాగే ప్రపంచం మొత్తం అఖండ అర్థ శతదినోత్సవం జరుపుకుంటుంది. ఈ వేడుకను పలుచోట్ల అభిమానులు జరుపుకుంటున్నారు. అందుకు గర్వంగా ఉంది” అని తెలిపారు.

Unstoppable with NBK : బాలయ్య బాబుతో కలిసి మహేష్ బాబు వచ్చేది అప్పుడే..

”బోయపాటి శ్రీను, నా కాంబినేషన్ హాట్రిక్. మా కలయిక జన్మజన్మలది. మా ఇద్దర్ని ఆ దేవుడే కలిపాడు. భగవంతుడు మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది అభిమానులను ఇచ్చాడు. నేను ఏది చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూనే వున్నారు. నాకు నాన్నగారు ఆదర్శం. ఈ ‘అఖండ’ విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయం. ఈ సినిమాలో తీసుకున్న అంశం హిందూ సమాజం, ధర్మం, పద్ధతులు. వాటిజోలికి ఎవరైనా వస్తే దేవుడు అఖండలా వచ్చి వారికి బుద్ధి చెబుతాడు. కలుషితమైపోయిన సమాజానికి ప్రక్షాళణగా ఈ సినిమా ఉంది” అని తెలిపారు. అనంతరం యాభైరోజుల జ్ఞాపికలని బాలకృష్ణ ఎగ్జిబిటర్లకు అందజేశారు. ఇక ఈ సినిమా ఇవాళ సాయంత్రం నుంచి డిస్నీప్లస్ హార్ట్ స్టార్లో స్ట్రీమింగ్ అవ్వనుంది.