Balakrishna : తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. నాన్నని తలుచుకుంటూ బాలకృష్ణ ఎమోషనల్ స్పీచ్

తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో బాలకృష్ణ మాట్లాడుతూ.. మీ అందరి గుండల్లో నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్. విశ్వానికే నట విశ్వరూపం చూపిన ఎన్టీఆర్ కారణజన్ముడు. నేను ఈ కార్యక్రానికి రావటం ఒక చరిత్రాత్మకం..............

Balakrishna : తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. నాన్నని తలుచుకుంటూ బాలకృష్ణ ఎమోషనల్ స్పీచ్

Balakrishna Speech in Tenali NTR shatha jayanthi uthsavalu event

Balakrishna :  గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పలు ప్రదేశాల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు తెనాలిలో ఆలపాటి రాజా ఆద్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ తనయుడు, నటుడు బాలకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ తన నాన్నని తలుచుకుంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. అలాగే మరిన్ని అంశాలపై కూడా మాట్లాడారు బాలయ్య బాబు.

తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో బాలకృష్ణ మాట్లాడుతూ.. మీ అందరి గుండల్లో నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్. విశ్వానికే నట విశ్వరూపం చూపిన ఎన్టీఆర్ కారణజన్ముడు. నేను ఈ కార్యక్రానికి రావటం ఒక చరిత్రాత్మకం. భౌతికంగా మన మధ్య లేకపోయిన మన గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి ఆయన. పాతాళ భైరవి ఓ లెజండ్రి సినిమా. ఎన్టీఆర్ ఉత్సవాల్లో గొప్ప వ్యక్తులను తీసుకువచ్చి సన్మానాలు చెయ్యటం మంచి విషయం. చాలా మంది గొప్ప వాళ్ళు పుట్టారు ఎన్టీఆర్ మాత్రం చెరగని ముద్ర వేశారు. పేదలకు,కూడు, గుడ్డ, నీడ, నినాదంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. రాజకీయాల్లో, సినిమాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. అపర భగీరథుడు ఆయన. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తెనాలి నుంచి ఎంతో మంది కళాకారులు కళారంగానికి ఇచ్చి కళలకు కణాచిగా మారింది. ఎన్టీఆర్ పక్కన నటించిన ప్రతి ఒక్కరు చిరస్మరనీయుడే. ఎన్టీఆర్ సినిమా చూడని వ్యకి ఎవరు ఉండరు. ఎన్టీఆర్ సినిమాలు బంగారపు గుడ్డు పెట్టె బాతులలాంటివి. ఎన్టీఆర్ నటనలో తోటి నటులకు ఒక ఇన్స్పిరేషన్.

ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలు ఒక పండగలాంటిది. ఎన్టీఆర్ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతం. భావితరాలు తెలుగు సరిగా మాట్లాడకపోవటం బాధ అనిపిస్తుంది. ముందు తరాలు దృష్టిలో పెట్టుకొని తెలుగు భాషని ముందుకు తీసుకువెళ్లాలి. పూర్వమే పాన్ ఇండియా సినిమాలు చేశారు ఎన్టీఆర్. పాతాళ భైరవి, భైరవద్విపం లాంటి సినిమాను ఇండియా అంతటా ఆడాయి. నా విశ్వాసమే నా ఆయుధం. ఏ ముహూర్తంలో క్యాన్సర్ హాస్పటల్ పెట్టామో మంచి వైద్యులు, సిబ్బంది, సేవలు అందించటం వల్ల పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్, సాయి మాధవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు.

Balakrishna : గాలా విత్ బాలా.. బాలయ్య ఆహా తెలుగు ఇండియన్ ఐడిల్స్ కి మామయ్య.. అదిరిపోయిన లుక్..

ఇటీవల జరిగిన ఓ సంఘటన గురించి మాట్లాడుతూ.. సినిమాని సినిమాలాగా చూడండి రాజకీయాలు రాజకీయాలుగా చేయండి. ఇటీవల నరసరావుపేటలో జరిగిన వేడుకల్లో ఓ ప్రజా ప్రతినిధి బాలకృష్ణ పాటలు తొలగించమని చెప్పటం సమంజసం కాదు. రాజకీయలకి సినిమాలకి ముడిపెట్టవద్దు. రాజకీయాలు రాజకీయలుగా చూసుంకుందాము రండి. రెండో సారి ఇటువంటి ఘటన జరిగితే చూస్తూ ఊరుకోను అని హెచ్చరించారు బాలకృష్ణ.