బోయపాటికి హ్యాండిచ్చిన బాలకృష్ణ

  • Edited By: veegamteam , April 27, 2019 / 08:14 AM IST
బోయపాటికి హ్యాండిచ్చిన బాలకృష్ణ

సింగిల్ లైన్ తో సినిమా తీసేస్తాం అంటే అస్సలు ఒప్పుకోవడం లేదు తెలుగు హీరోలు. స్క్రిప్ట్ దెగ్గరి నుంచి స్క్రీన్ ప్లే దాకా అంతా పక్కాగా ఉంటేనే డైరెక్టర్లకి ఓకే చెబుతున్నారు. కాదు కూడదు అంటే ఎంత పెద్ద డైరెక్టర్ ఐనాసరే మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తున్నారు. డైరెక్టర్స్ ఏమాత్రం లేట్ చేసినా మరొకరికి ఛాన్స్ ఇచ్చేస్తున్నారు.
 
సింహా, లెజెండ్ తర్వాత ముచ్చటగా మూడోసారి బోయపాటి శీను, బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే బాలకృష్ణ, బోయపాటికి సడెన్ షాక్ ఇచ్చాడు. బాలయ్య నెక్స్ట్ సినిమా కె.ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో రానున్నట్లు అఫిషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. అంతేకాదు మేలో సినిమాకి కొబ్బరికాయ కొట్టి జూన్ లో రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు.

మొన్నటి వరకు బోయపాటి సినిమాకి ఫిక్సయిన బాలయ్య సడెన్ గా కె.ఎస్ రవికుమార్ కి ఛాన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అయితే స్క్రిప్ట్ విషయంలో బోయపాటి బాలకృష్ణని సంతృప్తి పర్చకపోవడంతోనే వెయిటింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. కెఎస్ రవికుమార్ పక్కా స్క్రిప్ట్ తో రెడీగా ఉండటం ఆల్రెడీ జై సింహా సినిమాతో హిట్టివ్వడంతో బాలయ్య అటువైపు మొగ్గుచూపాడు.