Balakrishna To Fly To Turkey: టర్కీకి చెక్కేస్తున్న బాలయ్య.. దేనికోసమో తెలుసా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా చివరిదశ షూటింగ్ మిగిలి ఉంది. కాగా, బాలయ్య త్వరలోనే టర్కీ చెక్కేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న బాలయ్య, షూటింగ్ ఆగిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

Balakrishna To Fly To Turkey: టర్కీకి చెక్కేస్తున్న బాలయ్య.. దేనికోసమో తెలుసా?

Balakrishna TO Fly To Turkey For NBK107 Shooting

Balakrishna To Fly To Turkey: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా ప్రస్తుతం చివరిదశ షూటింగ్ మిగిలి ఉంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో షూటింగ్స్ ఆగిపోవడంతో బాలయ్య అండ్ టీమ్ ఈ సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేద్దామా అని ఆతృతగా చూస్తున్నారు. అయితే ఎంతకీ షూటింగ్‌లు మొదలుకాకపోవడంతో బాలయ్య ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

NBK107: బాలయ్య సినిమా టైటిల్.. ఆ రోజున వచ్చేస్తుందా?

బాలయ్య త్వరలోనే టర్కీ చెక్కేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న బాలయ్య, షూటింగ్ ఆగిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. దీంతో ఆయన NBK107 చిత్ర నిర్మాతలకు ఓ ఆదేశం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. వీలైనంత త్వరలో ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని.. ఇక్కడ పరిస్థితులు అనుకూలించకపోతే, విదేశాల్లో షూటింగ్ జరపాలని ఆయన కోరారట. అందుకే తమ నెక్ట్స్ షెడ్యూల్‌ను టర్కీలో నిర్వహించేందుకు బాలయ్య ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

NBK107: బాలయ్య అభిమానులకు ఈఏడాది లేనట్టే..?

మొత్తానికి సినిమా షూటింగ్‌లు బంద్ కావడంతో బాలయ్య ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నా, ఇంకా షూటింగ్‌ను వాయిదా వేయడం సరికాదని భావించి, ఇలా సినిమా షూటింగ్‌ను వేరే దేశంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.