NBK108: శ్రీలీలకు బాలయ్య తండ్రి కాదట.. ఏమవుతాడో తెలుసా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK108 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. ఈ సినిమాలో శ్రీలీలకు తండ్రిగా బాలయ్య కనిపిస్తాడని వార్తలు రాగా.. ఇప్పుడు ఈ సినిమాలో బాలయ్య ఆమెకు తండ్రి కాదని తెలుస్తోంది.

NBK108: శ్రీలీలకు బాలయ్య తండ్రి కాదట.. ఏమవుతాడో తెలుసా?

Balakrishna To Play Uncle Role For Sreeleela In NBK108

NBK108: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. NBK108 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని విధంగా అనిల్ రావిపూడి ప్రెజెంట్ చేస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

NBK108: అఫీషియల్.. దసరాకు ఆయుధపుజ చేయనున్న బాలయ్య.. పూనకాలు తెప్పిస్తానంటోన్న అనిల్ రావిపూడి

కాగా, ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తున్నట్లుగా చిత్ర వర్గాలు తెలిపిన సంగతి తెలిసిందే. కానీ, నిజానికి ఈ సినిమాలో బాలయ్య శ్రీలీల తండ్రిగా కనిపించడట. ఈ వార్తతో ఒక్కసారిగా అందరూ అవాక్కవుతున్నారు. తాజాగా చిత్ర వర్గాల్లో వినిపిస్తున్న వార్త ప్రకారం ఈ సినిమాలో బాలయ్య శ్రీలీలకు బాబాయ్ అవుతాడట. అగ్రెసివ్ పాత్రలో బాలయ్య పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలవబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. పూర్తి వైవిధ్యమైన యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

NBK108: బాలయ్య సినిమాలో కాజల్ అలాంటి పాత్రలో కనిపిస్తుందా..?

బాలయ్య భార్యగా అందాల భామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కనిపిస్తుందట. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య తెలంగాణ భాషలో మాట్లాడుతాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవగా, త్వరలోనే ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.