Unstoppable Anthem: అన్‌స్టాపబుల్ యాంథెమ్.. టెంపర్ లేచుద్ది అంటూ దూసుకొచ్చిన బాలయ్య!

నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేసిన టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో స్ట్రీమింగ్ అయ్యి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ టాక్ షోకు సంబంధించి రెండో సీజన్‌ను నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ టాక్ షోకు సంబంధించిన యాంథెమ్‌ను ఆహా నిర్వాహకులు రిలీజ్ చేశారు.

Unstoppable Anthem: అన్‌స్టాపబుల్ యాంథెమ్.. టెంపర్ లేచుద్ది అంటూ దూసుకొచ్చిన బాలయ్య!

Unstoppable Anthem: నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేసిన టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో స్ట్రీమింగ్ అయ్యి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ టాక్ షోతో బాలయ్య తనలోని యాంకర్‌ను కూడా ప్రేక్షకులు పరిచయం చేశాడు. బాలయ్య ఇలా జాలీగా, సరదాగా ఉంటూ వచ్చినవారిని ప్రశ్నలు అడగడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. ఈ టాక్ షో అప్పట్లో సూపర్ సక్సెస్ కావడంతో, ఇప్పుడు ఈ టాక్ షోకు సంబంధించి రెండో సీజన్‌ను నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

Unstoppable 2: దెబ్బకు థింకింగ్ మారిపోవాలి.. పండగకే బాలయ్య బాబు ల్యాండ్ అవుతున్నాడా..?

బాలయ్య కూడా రెండో సీజన్ అన్‌స్టాపబుల్ షో ఉంటుందని గతంలోనే వెల్లడించారు. దీంతో ఈ టాక్ షో రెండో సీజన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, తాజాగా ఈ టాక్ షోకు సంబంధించిన యాంథెమ్‌ను ఆహా నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ యాంథెమ్ సాంగ్‌ను సింగర్ రోల్ రైడా తనదైన ర్యాప్ వర్షన్‌తో ఆలపించగా, బాలయ్య నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లోని సెన్సేషనల్ డైలాగులతో నింపారు. ఇక మహతి స్వర సాగర్ కంపోజిషన్ ఈ యాంథెమ్ సాంగ్‌కు బాగా కలిసొచ్చింది.

UnStoppable 2 : బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 రెడీ.. అధికారికంగా ప్రకటించిన ఆహా..

టెంపర్ లేచుద్ది అంటూ బాలయ్య చెప్పిన డైలాగులు అభిమానులకు మరోసారి గూస్‌బంప్స్ తీసుకొచ్చాయి. ఇక ఈ యాంథెమ్‌తో నందమూరి అభిమానుల్లో అప్పుడే ఈ టాక్ షోపై ఆసక్తిని క్రియేట్ చేశారు నిర్వాహకులు. అతి త్వరలోనే ఈ టాక్ షోను స్టార్ట్ చేసేందుకు ఆహా ప్లాన్ చేస్తోంది. కాగా, ఈసారి తొలి ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తారనే టాక్ జోరుగా సాగుతోంది. మరి ఈ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే యాంథెమ్‌పై మీరూ ఓసారి లుక్కేయండి.